Breaking News

రఫ్‌ కట్‌ చూశా... భలే నచ్చింది  – రవితేజ

Published on Sun, 09/06/2026 - 03:43

రవితేజ సోదరుడి తనయుడు, రఘు కుమారుడు మాధవ్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘మారెమ్మ’. దీపా బాలు హీరోయిన్‌గా నటించారు. మంచాల నాగరాజ్‌ దర్శకత్వంలో మయూర్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న రిలీజ్‌ కానుంది. శనివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన రవితేజ మాట్లాడుతూ– ‘‘తెలంగాణలోని మహిషాపురంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. 

ఈ సినిమా రఫ్‌ కట్‌ చూశాను... భలే నచ్చింది. ఎమోషన్స్‌ బాగున్నాయి. కుషాల్, మయూర్‌లకు ఈ సినిమాతో మంచి పేరు, డబ్బులు, సక్సెస్‌ రావాలని కోరుకుంటున్నాను. తమిళ అమ్మాయి దీపా తెలంగాణ భాష నేర్చుకుని, ఈ సినిమాలో బాగా పెర్ఫార్మ్‌ చేసింది. తొలి సినిమా అయినా నాగరాజు బాగా తీశారు. తమ్ముడు మాధవ్‌ బాగున్నావ్‌ రా.. ! ఈ సినిమా కోసం మాధవ్‌ ట్రాన్స్‌ఫార్మ్‌ అయిన తీరు బాగుంది. ఆల్‌ ది బెస్ట్‌’’ అని అన్నారు. 

మాధవ్‌ భూపతిరాజు మాట్లాడుతూ– ‘‘ఆయన (రవితేజ) నాకు పెదనాన్న కాదు... నా అన్నయ్య. నా తొలి సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఆయన రావడం హ్యాపీగా ఉంది. ఒక మనిషికి, ఒక దున్న΄ోతుకు మధ్య ఉన్న అనుబంధం తాలూకు ఎమోషన్‌ను ఊరి దైవం మారెమ్మతో కథలో చక్కగా  బ్లెండ్‌ చేశారు నాగరాజుగారు. ఇందులో మంచి లవ్‌స్టోరీ కూడా ఉంది’’ అన్నారు. మయూర్‌ రెడ్డి మాట్లాడుతూ–‘‘నాగరాజు ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఇది మా ఊరి కథ అని ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాను. మాధవ్‌ ఇలాంటి రూటెడ్‌ కథను ఎంచుకోవడం ఒక సాహసమే అని చెప్పాలి’’ అని చెప్పారు. మంచాల నాగరాజు మాట్లాడుతూ– ‘‘2006 టైమ్‌ ఫ్రేమ్‌లో ఈ సినిమా కథ సాగుతుంది’’ అన్నారు.

Videos

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

Photos

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)