Breaking News

రవితేజ.. 'అక్కాయిలు బాగున్నారా?'

Published on Mon, 04/27/2026 - 15:55

ఒకప్పుడు స్టార్ హీరోగా వరస హిట్స్ అందుకున్న రవితేజ.. ఇప్పుడు పూర్తిగా డౌన్ అయిపోయాడు. ఎంతలా అంటే సరైన హిట్ కొట్టి దాదాపు ఐదేళ్లు గడిచిపోయింది. ఆడియెన్స్ కూడా ఇతడి మూవీస్ థియేటర్లలో రిలీజ్ అవుతున్నా సరే పెద్దగా పట్టించుకోవట్లేదు. ఈ ఏడాది సంక్రాంతికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే మూవీతో వచ్చాడు. కంటెంట్ పర్లేదనిపించింది గానీ వసూళ్లు పెద్దగా రాలేదు. సరే ఇవన్నీ పక్కనబెడితే ఇప్పుడు రవితేజ చేయబోయే కొత్త సినిమా కోసం ఓ విచిత్రమైన టైటిల్ అనుకుంటున్నారట.

(ఇదీ చదవండి: ప్రీమియర్లకే నెగిటివ్ టాక్.. కానీ తొలి వీకెండే 'మైఖేల్'కి వేల కోట్ల కలెక్షన్స్)

ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఇరుముడి' అనే సినిమాని రవితేజ చేస్తున్నారు. కూతురి సెంటిమెంట్‌తో పాటు అయ్యప్ప మాలకు సంబంధించిన పార్ట్ కూడా ఇందులో ఉండనుంది. దీని తర్వాత చేయబోయే మూవీ ఏంటనేది ఇంకా ఖరారు కాలేదు. ఇప్పుడదే ఫైనల్ అయ్యేలా ఉందని తెలుస్తోంది. 'రాజరాజచోర' అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయమై మెప్పించిన హసిత్ గోలి.. తర్వాత 'స్వాగ్' తీశాడు గానీ ఫ్లాప్ అయింది.

ఇప్పుడీ దర్శకుడే రవితేజకు ఓ స్టోరీ చెప్పాడని, దీన్ని దిల్ రాజు నిర్మించనున్నారని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసమే  'అక్కాయిలు బాగున్నారా?' అనే టైటిల్ అనుకుంటున్నారని తెలుస్తోంది. మరి ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి సోషల్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Videos

కవిత పార్టీపై కేటీఆర్ రియాక్షన్

ఘోర ప్రమాదం కార్మికులపై కూలిన క్రేన్

TDP చేసే రాజకీయాల కన్నా, ప్రాస్టిట్యూట్ చేసుకునే మహిళా చాల బెటర్

కొనసాగుతున్న బంగారం ధరల పతనం... గోల్డ్ కొన్నవారికి వరుస షాక్స్

అగ్ని ప్రమాదం ఎలా జరిగిందంటే..? బూడిదైన కార్లు..!

శవాన్ని ఎంత అలంకరించినా లేచి నిలబడదు..!

పోలీస్ వ్యవస్థ బతికే ఉంటే రాధాకృష్ణపై ఫిర్యాదు తీసుకోవాలి

కాసుల పంట పండించిన గోల్డ్ బాండ్లు.. లక్షకు 5 లక్షలొచ్చాయ్..

తేజస్వీ సూర్య ఒక వెదవ

అంబర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం

Photos

+5

‘వదలా’ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రెడ్‌ శారీలో ఫరియా అబ్దుల్లా క్యూట్ లుక్స్‌ (ఫొటోలు)

+5

మెరిసిపోతున్న మానస చౌదరి (ఫొటోలు)

+5

ఏపీకి కూటమి శాపం.. ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఇక్కడేందుకు? (ఫొటోలు)

+5

‘ఏక్‌ దిన్‌’ మూవీ మ్యూజికల్‌ ఈవెంట్‌లో సాయి పల్లవి (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఆకట్టుకున్న ‘సాక్షి’ హ్యాపీ కిడ్స్‌ ఈవెనింగ్‌ (ఫొటోలు)

+5

హనీ ఈజ్‌ ది బెస్ట్‌.. పెళ్లి చేసుకున్న నటి మోహరీన్‌ (ఫోటోలు)

+5

ఈవెంట్‌లో జంటగా అల్లు శిరీష్-నయనిక (ఫొటోలు)

+5

ఫ్రెండ్స్‌తో నైట్ పార్టీలో హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

అంబానీ ఇంట పాప్ స్టార్ రిహన్నా సందడి.. ఆటపాటలతో కోలాహలం (ఫొటోలు)