Breaking News

ఆ పిచ్చి మన వాళ్లకే ఉంది: రవితేజ

Published on Sun, 08/11/2024 - 16:58

టాలీవుడ్‌లో ప్రస్తుతం రీరిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు అన్ని వారి వారి బర్త్‌డే సందర్భంగా మళ్లీ థీయేటర్స్‌లో సందడి చేస్తున్నాయి. ఆ సినిమాలు విడుదలైనప్పుడు రానన్ని కలెక్షన్స్‌ రీరిలీజ్‌ టైమ్‌లో వస్తున్నాయంటే.. పాత సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తున్నారో తెలుసుకోవచ్చు. తాజాగా మహేశ్‌ బాబు మురారి సినిమా ఆయన బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్‌ 9న రీరిలీజై దాదాపు 7.32 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టి చరిత్ర సృష్టించింది.

 అయితే పాత సినిమాలు మళ్లీ థియేటర్స్‌లోకి వచ్చి భారీగా కలెక్షన్స్‌ రాబట్టడం ఆశ్యర్యానికి గురి చేస్తుందని అంటున్నాడు మాస్‌ మహారాజా రవితేజ. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రీరిలీజ్‌ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రీరిలీజ్‌ ట్రెండ్‌ మన(టాలీవుడ్‌) దగ్గరే ఉంది.  నిజంగా మన ప్రేక్షకులను దేవుళ్లు అనొచ్చు. వాళ్లు సినిమాను ఎంతలా ప్రేమిస్తారో ఈ రీరిలీజ్‌ కలెక్షన్స్‌ని చూస్తే అర్థమవుతుంది. ఒక పాత సినిమాను మార్నింగ్‌ 6.30 థియేటర్స్‌కి వెళ్లి చూడడం ఆశ్యర్యంగా అనిపిస్తుంది. 

అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు రిలీజ్‌ అయితే ఉదయం 7 గంటలకు వెళ్లి చూసేవాళ్లం. అవి కొత్త సినిమాలు కాబట్టి అంత మార్నింగ్‌ వెళ్లేవాళ​ం. కానీ ఇప్పటి ప్రేక్షకులు ఉదయం 5 గంటలకే వెళ్లి చూస్తున్నారు. నిజంగా వాళ్లు చాలా గ్రేట్‌. ఇలాంటి పిచ్చి మనవాళ్లకు తప్ప ఎక్కడా లేదు’ అని రవితేజ అన్నారు. ఇక నీకు ఏ సినిమా రీరిలీజ్‌ కావాలని ఉంది అని యాంకర్‌ అడగ్గా.. అమితాబ్‌ బచ్చన్‌ ‘షోలే’ అని రవితేజ బదులిచ్చాడు. కాగా, గతంలో రవితేజ ‘విక్రమార్కుడు’, ‘వెంకీ’ సినిమాలు కూడా రీరిలీజై మంచి వసూళ్లను రాబట్టాయి.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)