Breaking News

ఈగల్‌ టీజర్‌లో రవితేజ విధ్వంసం.. ఎలా ఉందో చూసేయండి

Published on Mon, 11/06/2023 - 11:32

రవితేజ  హీరోగా దర్శకుడు కార్తిక్‌ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న సినిమా 'ఈగల్‌'. భారీ యాక్షన్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ లుక్‌ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇందులో  అనుపమ పరమేశ్వరన్‌, కావ్యా థాపర్‌ నటిస్తున్నారు. నవదీప్‌, మధుబాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  టి. జి. విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  తాజాగా ఈగల్‌ టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. 

(ఇదీ చదవండి: రష్మిక మందన్న ఫేక్‌ వీడియో వైరల్‌.. వారిని శిక్షించాలని డిమాండ్‌)

కొండ‌లో లావాను కింద‌కు పిల‌వ‌కు. ఊరు ఉండ‌దు. నీ ఉనికి ఉండ‌దు అంటూ ర‌వితేజ చెప్పిన పంచ్ డైలాగ్‌తో టీజ‌ర్ ఇంట్రెస్టింగ్‌గా ప్రారంభ‌మైంది. అడ‌విలో ఉంటాడు. నీడై తిరుగుతుంటాడు. క‌నిపించ‌డు. కానీ వ్యాపించి ఉంటాడు.. వెలుతురు వెళ్లే ప్రతిచోటకు వాడి బుల్లెట్‌ వెళుతుంది అంటూ ర‌వితేజ క్యారెక్ట‌ర్ గురించి ఇచ్చిన ఎలివేష‌న్ డైలాగ్స్‌ టీజ‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి.

ఈగ‌ల్ సినిమాను కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. గతంలో ఆయన నిఖిల్‌తో 'సూర్య వ‌ర్సెస్ సూర్య' చిత్రంతో మెప్పించాడు.. కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేనికి ఇది రెండో సినిమా. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నట్లు టీజర్‌లో ప్రకటించారు. ఇటీవల 'టైగర్‌ నాగేశ్వరరావు'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన రవితేజ.. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గతంలో డాన్‌శీను, బలుపు, క్రాక్‌ వచ్చాయి.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)