Breaking News

సంక్రాంతి నుంచి తప్పుకుంటున్న రవితేజ.. కారణం ఇదేనా?

Published on Thu, 01/04/2024 - 13:25

మాస్‌ మహారాజా రవితేజ  నటిస్తున్న తాజా చిత్రం ఈగల్‌.. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇందులో అనుపమపరమేశ్వరన్‌తో పాటు కావ్య థాపర్ కీలక పాత్రలో నటిస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకొస్తోందని ఈ చిత్ర యూనిట్‌ కొద్దిరోజుల క్రితం కౌంట్‌డౌన్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. కానీ సంక్రాంతి రేసు నుంచి ఈగల్‌ తప్పుకుంటున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. 

ఈగ‌ల్ సినిమాకు సెన్సార్ బోర్డ్ కూడా యూ/ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. ఒక్క కట్‌ కూడా లేకుండా ఈ చిత్రానికి సెన్సార్ ఇవ్వడం గమనార్హం. కానీ సంక్రాంతి రేసులో భారీగా చిత్రాలు ఉండటం వల్ల రెండు రాష్ట్రాల్లో థియేటర్స్‌ కొరత ఏర్పడింది. మహేష్‌ బాబు గుంటూరు కారం, హనుమాన్‌,వెంకటేష్‌ సైంధవ్‌, నా సామిరంగా వంటి చిత్రాలు ఉండటంతో రేసు నుంచి తప్పకుంటే బెటర్‌ అని ఈగల్‌ టీమ్‌ ఆలోచిస్తుందట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈగల్‌... ఇన్నీ సినిమాల మద్య వస్తే థియేటర్స్‌ కొరత ఏర్పడి నష్టాలు రావచ్చని వారు అంచనా వేస్తున్నారట. సినీ విశ్లేషకులు కూడా ఇదే సరైన నిర్ణయం అని వ్యాఖ్యానిస్తున్నారు.  

నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌- రవితేజ కాంబోలో గతేడాది 'ధమాకా' చిత్రంతో సూపర్‌ హిట్‌ కొట్టారు. ఇప్పుడు ఈగల్‌ కూడా భారీ హిట్‌ కొట్టడం ఖాయం అనుకుంటున్న తరుణంలో సంక్రాంతి నుంచి ఈ చిత్రం వాయిదా పడుతుందనే వార్తలు సోషల్‌మీడీయాలో ప్రచారం జరుగుతుండటంతో రవితేజ ఫ్యాన్స్‌ కొంతమేరకు నిరుత్సాహానికి గురి అయ్యారు. ఈగల్‌ సినిమా వాయిదా దాదాపు ఖాయం.. కానీ అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)