Breaking News

పవన్‌ సినిమాను పక్కన పెట్టిన హరీష్‌ శంకర్‌.. రవితేజతో హ్యాట్రిక్‌ ఫిల్మ్‌!

Published on Thu, 12/14/2023 - 08:57

‘మిరపకాయ్‌’ వంటి మాస్‌ హిట్‌ను హీరో రవితేజకు ఇచ్చారు దర్శకుడు హరీష్‌ శంకర్‌. అలాగే రవితేజతో ‘ధమాకా’ వంటి మాస్‌ హిట్‌ చిత్రాన్ని నిర్మించారు పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్‌. ఇప్పుడు ఈ హీరో–డైరెక్టర్‌-ప్రొడ్యూసర్‌ కాంబినేషన్‌ ఒకే సినిమాకి కుదిరింది.

రవితేజ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించనున్నట్లు బుధవారం పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది. ‘‘ఈసారి మాస్‌ రీ యూనియన్‌ ఇంకా స్పైసీగా ఉంటుంది. త్వరలో ఇతర వివరాలు తెలియజేస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది.

హరీష్‌ అది వదిలేశాడు.. రవితేజ ఇది పక్కన పెట్టాడు
రవితేజ-హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ మూవీ ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వినిపించాయి. అయితే ఇంత త్వరగా వీరి మూడో ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుందని ఊహించలేదు. ప్రస్తుతం హరీష్‌ శంకర్‌.. పవన్‌ కల్యాణ్‌తో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ మూవీ షూటింగ్‌ ఎప్పుడో మొదలైంది. కానీ ఇంతవరకు సగం పార్ట్‌ కూడా పూర్తి కాలేదు. షూటింగ్‌ ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియదు. అందుకే హరీష్‌ శంకర్‌ ఆ సినిమాను పక్కకు పెట్టి రవితేజతో సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు.

ఇక రవితేజ పరిస్థితి కూడా అంతే. క్రాక్‌ తర్వాత మరోసారి గోపిచంద్‌ మలినేని-రవితేజ కలిసి పనిచేసేందుకు రెడీ అయ్యారు. రవితేజ కోసం గోపిచంద్‌ మంచి  కథ కూడా సిద్ధం చేసుకున్నాడు.అయితే బడ్జెట్‌ చేతులు దాటి పోవడంతో ఈ ప్రాజెక్ట్‌ని పక్కనపెట్టేశారట. దీంతో రవితేజ హరీష్‌తో సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు. ‘షాక్‌’, ‘మిరపకాయ్‌’ సినిమాల వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ హ్యాట్రిక్‌ మూవీ ఎలా ఉంటుందో చూడాలి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)