Breaking News

తృటిలో తప్పించుకున్నాం!

Published on Mon, 02/19/2024 - 00:29

చావు నుంచి తృటిలో తప్పించుకున్నామని చెబుతున్నారు హీరోయిన్‌ రష్మికా మందన్నా. అసలు విషయం ఏంటంటే... ఇటీవల ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు రష్మికా మందన్నా ఓ విమానంలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఈ విమానంలోనే మరో హీరోయిన్‌ శ్రద్ధాదాస్‌ కూడా ఉన్నారు. అయితే విమానం టేకాఫ్‌ అయిన అరగంటలోపే ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి ముంబైలోనే అత్యవసర ల్యాండింగ్‌ చేశారు.

ఈ ఆందోళనకరమైన ఘటనను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేశారు రష్మికా మందన్నా. ‘చావు నుంచి మేం తృటిలో తప్పించుకున్నాం’ అనే క్యాప్షన్‌తో శ్రద్ధాదాస్‌తో ఉన్న ఫోటోను షేర్‌ చేశారు రష్మికా మందన్నా. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌ అవుతోంది. కాగా ఇదే ఘటనపై హీరోయిన్‌ శ్రద్ధాదాస్‌ కూడా స్పందించారు. ‘‘విమానంలో వందమందికిపైగా ప్రయాణికులున్నారు. మేం దాదాపు చనిపోతామనే భావన కలిగింది. కానీ, పైలెట్‌ సరైన నిర్ణయం తీసుకుని అత్యవసర ల్యాండింగ్‌ చేశారు’’ అంటూ ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు శ్రద్ధాదాస్‌.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)