Breaking News

బాలీవుడ్‌లో దూసుకెళ్తున్నా రష్మిక.. 2025లో మూడు సినిమాలు!

Published on Sun, 01/05/2025 - 13:40

హీరోయిన్‌ రష్మికా మందన్నా(Rashmika Mandanna ) కెరీర్‌లో రానున్న తొలి హారర్‌ మూవీ ‘థామా’. ఈ చిత్రంలో ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా నటిస్తున్నారు. హారర్‌ మూవీ ‘వంజ్య’తో హిట్‌ కొట్టిన దర్శకుడు ఆదిత్యా సర్పోత్తా ఈ సినిమాకు దర్శకుడు. ‘బాలీవుడ్‌ నిర్మాత దినేష్‌ విజన్‌ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ గత ఏడాది విడుదలైంది. తొలి షెడ్యూల్‌ను ముంబైలో జరిపారు. సెకండ్‌ షెడ్యూల్‌ను గతేడాది డిసెంబరు చివరి వారంలో ఢిల్లీలో ప్రారంభించారు. న్యూ ఇయర్‌ బ్రేక్‌ తీసుకుని, మళ్లీ ఈ వారంలో ‘థామా’ చిత్రీకరణను ప్రారంభిస్తున్నారు. 

‘థామా’ చిత్రీకరణ కోసం ఢిల్లీ బయలుదేరినట్లుగా తన ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు ఆయుష్మాన్‌ ఖురానా. అలాగే న్యూ ఇయర్‌ వేడుకలను పూర్తి చేసుకున్న రష్మికా మందన్నా కూడా ఢిల్లీలో జరిగే ‘థామా’ షెడ్యూల్‌లో ఆయుష్మాన్‌  ఖురానాతో కలిసి పాల్గొననున్నారని బాలీవుడ్‌ సమాచారం. జనవరి మూడో వారం వరకు ‘థామా’ షూటింగ్‌ షెడ్యూల్‌ జరుగుతుందట. 

ఈ ఢిల్లీ షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత ఈ సినిమా చిత్రీకరణ నెక్ట్స్‌ షెడ్యూల్‌ ఊటీలో జరగనుందని బీ టౌన్‌ టాక్‌. ఇక ‘థామా’ ఈ ఏడాది దీపావళికి రిలీజ్‌ కానుంది. అలాగే హిందీలో సల్మాన్‌ ఖాన్‌తో ‘సికందర్‌’, విక్కీ కౌశల్‌తో ‘ఛావా’ చిత్రాలు చేస్తున్నారు రష్మికా మందన్నా. 

‘సికందర్‌’ సినిమా ఈ ఏడాది ఈద్‌కి, ‘ఛావా’ చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్‌ కానున్నాయి. ఇలా హిందీలో రష్మికా మందన్నా నటించిన చిత్రాలు ఈ ఏడాది మూడు రిలీజ్‌ కానున్నాయి.

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)