Breaking News

రష్మిక 'థామా' సినిమా.. ఫస్ట్‌ డే రికార్డ్‌ కలెక్షన్స్‌

Published on Wed, 10/22/2025 - 11:25

రష్మిక మందన్న,  ఆయుష్మాన్‌ ఖురానా నటించిన థామా (Thamma) మొదటిరోజే భారీ కలెక్షన్స్రాబట్టింది. హారర్‌ కామెడీ ఫిల్మ్‌ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. స్త్రీ, భేడియా, ముంజ్యా, స్త్రీ 2 వంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక హారర్‌ యూనివర్స్‌ను క్రియేట్చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ మాడాక్‌ ఫిల్మ్స్‌ థామాను తెరకెక్కించింది. అయితే, ఈ చిత్రానికి విమర్శకులు, ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలు వచ్చాయి. కానీ దీపావళి పండుగ కారణంగా బాక్సాఫీస్ వద్ద బంపర్ ఓపెనింగ్స్ సాధించగలిగింది.

బాక్సాఫీస్కలెక్షన్స్ప్రకటించే సక్నిల్క్ ప్రకారం.. థామా చిత్రం సుమారు రూ. 25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది చాలా మంచి ఓపెనింగ్అని చెప్పవచ్చు. ఆయుష్మాన్ కెరీర్లో ఇప్పటివరకు తన అతిపెద్ద ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా థామా రికార్డ్క్రియేట్చేసింది. ఛావా, పుష్ప 2 వంటి చిత్రాలతో రష్మికకు భారీ ఓపెనింగ్స్ ఉన్న విషయం తెలిసిందే. నిర్మాణ సంస్థ నుంచి వరుసగా స్త్రీ, స్త్రీ2 బ్లాక్ బస్టర్లు కావడంతో థామాపై భారీ అంచనాలు పెరిగాయి. ఆపై దీపావళి సెలవులు ఉండటంతో భాగానే కలిసొచ్చింది.

థామా సినిమాలో అలోక్‌ గోయల్‌ (ఆయుష్మాన్‌ ఖురానా), తడ్కా (రష్మిక) మెప్పించారు. భేడియాగా ప్రత్యేక పాత్రలో వరుణ్‌ ధావన్‌ అదరగొట్టేశాడు. మూవీ సెకడాఫ్చాలా బాగుందని ఎక్కువగా రివ్యూస్వచ్చాయి. మలైకా అరోరా, నోరా ఫతేహి ప్రత్యేక గీతాల్లో కనిపించి మెప్పించారు. సచిన్‌-జిగర్‌ సంగీతం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)