చెత్త వేయొద్దన్నందుకు GHMC మహిళపై దాడి!
Breaking News
‘రాకా’లోకి రష్మిక ఎంట్రీ. . బన్నీతో మరోసారి..
Published on Sat, 06/27/2026 - 14:21
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మరోసారి వెండితెరపై జోడీగా కనిపించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇప్పటికే పుష్ప, పుష్ప 2లో చిత్రాల్లో జోడీగా నటించి మెప్పించిన ఈ జంట.. ఇప్పుడు ‘రాకా’ కోసం మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట. త్వరలోనే ముంబైలో జరగబోయే కొత్త షెడ్యూల్లో రష్మిక పాల్గొనబోతున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రంలో రష్మికతో పాటు దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇప్పటికే దీపికా పదుకొణె షూటింగ్లో పాల్గొంది. కొత్త షెడ్యూల్లో రష్మికతో పాటు మృణాల్, జాన్వీలకు సంబంధించిన కీలక సీన్లను కూడా షూట్ చేయబోతున్నారట.
ఇక ఈ సినిమాలో షారుక్ ఖాన్ కూడా కీలక పాత్ర చేయబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇప్పటి వరకు ప్రకటన రాలేదు. త్వరలోనే ఓ ఈవెంట్ నిర్వహించి, షారుక్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇస్తారట.ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ రూ. 700 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివరిలో షూటింగ్ పూర్తి చేసుకొని.. వచ్చే ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్గా పెట్టుకున్నారు.
Tags : 1