Breaking News

విజయ్‌తో ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌.. అసలు విషయం చెప్పేసిన రష్మిక!

Published on Tue, 11/04/2025 - 17:12

ఈ ఏడాది వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న బ్యూటీ రష్మిక మందన్నా. ఇప్పటికే ఛావాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ కొట్టిన ఈ బ్యూటీ.. ఇటీవలే థామా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం రష్మిక నటించిన ది గర్ల్‌ఫ్రెండ్‌ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. ఈ సినిమా నవంబర్‌ 7న థియేటర్లలో సందడి చేయనుంది.

ది గర్ల్‌ఫ్రెండ్‌ మూవీ ప్రమోషన్లలో భాగంగా రష్మిక తాజాగా టాలీవుడ్‌ టాక్‌ షోకు హాజరైంది. నటుడు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము..నిశ్చయమ్మురా టాక్‌ షోలో సందడి చేసింది. ఈ షోలో పాల్గొన్న రష్మిక చేతికి రెండు ఉంగరాలు కనిపించడంతో అందరి దృష్టి వాటిపై పడింది. ఈ సందర్భంగా రష్మికను జగపతిబాబు సరదాగా ఆటపట్టించారు. దళపతి విజయ్, విజయ్ సేతుపతి, విజయ్ దేవరకొండతో ఫ్రెండ్‌షిప్, విజయ్ సేతుపతి  ఫ్యాన్‌, దళపతి విజయ్‌కి ఆల్‌ టైమ్ ఫ్యాన్ ఇలా విజయాన్ని సొంతం చేసేసుకున్నావా? అంటూ ఫన్నీగా మాట్లాడారు.

ఆ తర్వాత చేతికి ఉన్న రింగ్స్‌ను సెంటిమెంట్‌తోనే పెట్టుకున్నావా అని జగపతిబాబు అడిగారు. దీనికి రష్మిక మాట్లాడుతూ.. అవీ చాలా ఇంపార్టెంట్‌ అని ముద్దుగుమ్మ చెప్పేసింది. వాటిలో ఒక రింగ్‌ ఫేవరేట్‌ అయి ఉంటుంది.. దానికి ఓ హిస్టరీ కూడా ఉంటుందని జగపతి నవ్వుతూ అన్నారు. దీనిపై ఆడియన్స్ ఏదో గోల చేస్తున్నారు.. అదేంటో కనుక్కోండని రష్మికతో చెప్పగా.. అది తాను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నానంటూ సంతోషం వ్యక్తం చేసింది.

‍అయితే గతనెలలో రష్మిక- విజయ్ దేవరకొండకు ఎంగేజ్‌మెంట్‌ జరిగిందని వార్తలొచ్చాయి. కానీ ఈ విషయాన్ని ఎవరూ కూడా అధికారికంగా ప్రకటించలేదు. దీంతో టాలీవుడ్‌ ప్రియులతో పాటు అభిమానుల్లోనూ సస్పెన్స్‌ నెలకొంది. ఇటీవల తరచుగా రష్మిక చేతికి ప్రత్యేక రింగ్‌ కనిపించడంతో నిశ్చితార్థం జరిగినట్లు ఫ్యాన్స్ ఫుల్‌గా ఫిక్సయిపోయారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)