Breaking News

ఆమె సినిమాల్లోకి ఎంట్రీ.. అప్పటికీ నువ్వింక పుట్టనేలేదు.. రష్మికపై నెటిజన్స్‌ ట్రోల్స్!

Published on Mon, 07/07/2025 - 20:39

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా చేసిన కామెంట్స్‌ వారికి కోపం తెప్పిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా రష్మికపై మండిపడుతున్నారు. మీ అజ్ఞానాన్ని అందరిపై రుద్దొద్దని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అసలు రష్మిక చేసిన కామెంట్స్ ఏంటి? ఎందుకింతలా వ్యతిరేకత వస్తుందో? మీరు కూడా చూసేయండి.

నేను ఫస్ట్ అంటూ కామెంట్స్..

ఇటీవల రష్మిక మందన్నా.. కూర్గ్‌ జిల్లాలోని కొడవ జాతి నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటి నటిని అని తన గురించి తాను గొప్పగా చెప్పుకుంది. ఈ వ్యాఖ్యలే రష్మికను టార్గెట్‌ చేసేలే చేశాయి. ఆమె కామెంట్స్‌పై పెద్ద ఎత్తున వివాదం మొదలైంది. ఎందుకంటే ఆమె కంటే ముందు పలువురు నటీనటులు కూర్గ్‌ నుంచి ఇండస్ట్రీకి వచ్చారు. మీ కంటే ముందుగానే 1990ల్లోనే నెరవంద ప్రేమ కూర్గ్ నుంచి వచ్చారని చురకలంటించారు. అంతేకాకుండా నీ కంటే ముందు నుంచే  గుల్షన్ దేవయ్య బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారని గుర్తు చేశారు.

రష్మిక చేసిన కామెంట్స్‌పై నటి ప్రేమ కూడా స్పందించింది. ఈ విషయంలో నేను ఏమి చెప్పగలను? కొడవ సమాజానికి నిజమేంటో తెలుసు.. ఆమె వర్షన్ గురించి తననే అడగాలని సూచించింది. కొడవ నటులు రష్మిక మందన్నకు మార్గం సుగమం చేశారని ప్రేమ వెల్లడించారు.

ప్రేమ మాట్లాడుతూ..' రష్మిక సినిమాల్లోకి రాకముందే ఇతరులు ఆమెకు మార్గం సుగమం చేశారు. నా కంటే ముందు కూర్గ్‌కు చెందిన శశికళ అనే నటి సహాయక పాత్రలు పోషించింది. అప్పుడే నేను చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించా. ఆ తరువాత చాలా మంది కొడవ వాళ్లు బాగా రాణించారు.' అని అన్నారు. కాగా.. ప్రేమ 1990ల్లో కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో నటించింది. తన నటనకు గానూ కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు, ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డులను అందుకుంది.

రష్మికపై నెటిజన్ల ట్రోల్స్..

రష్మిక కామెంట్స్‌పై  సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్రోల్స్ వచ్చాయి. ఆమె కంటే ముందే  ప్రేమ, నిధి సుబ్బాయ్య, హరిషిక పూనాచా, తనీషా కుప్పందా లాంటి వాళ్లు సినిమాల్లో నటించారని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. కూర్గ్ నుంచి వచ్చిన మొదటి నటినని చెప్పడం వందశాతం తప్పు.. ఎందుకంటే రష్మిక రాకముందే  5 నుంచి 6 మంది ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ప్రేమ మేడమ్ ఓం అనే కన్నడ సినిమాలో నటించినప్పుడు రష్మిక అస్సలు పుట్టలేదని మరో నెటిజన్ రాశారు. రష్మిక బహుశా నీకు నువ్వే గొప్ప ‍అనుకోవచ్చు.. కానీ గుల్షన్ దేవయ్య కూడా గొప్పగా నటించాడనే విషయాన్ని నువ్వు ఎలా మర్చిపోయావు అంటూ ప్రశ్నించాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)