నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది వారే.. కాంతార హీరోపై రష్మిక షాకింగ్ కామెంట్స్

Published on Wed, 01/18/2023 - 21:14

రష్మిక మందన్నా సౌత్‌ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటించింది. పుష్ప సినిమా ఒక్కసారిగా నేషనల్ క్రష్‌గా మారిపోయింది ముద్దుగుమ్మ. ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉంది. అయితే గతంలో రిషబ్‌ శెట్టి కాంతార సినిమాపై కామెంట్స్‌ చేసి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. కన్నడలో ఘన విజయం సాధించిన కాంతార చిత్రం విషయంలో రష్మిక మాటలు తీవ్ర వివాదాస్పదం కావడమే ఇందుకు కారణం. ఒక దశలో కన్నడ చిత్ర పరిశ్రమ రష్మికను బ్యాన్‌ చేసిందనే ప్రచారం కూడా జరిగింది. ఈ విషయంలో రిషబ్‌ శెట్టి, రష్మిక ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రష్మిక రిషబ్‌ శెట్టి, రక్షిత్‌ శెట్టిలపై పాజిటివ్ కామెంట్స్ చేశారు. కిరాక్ పార్టీ అనే చిత్రం ద్వారా తనను ఇండస్ట్రీకి పరిచయం చేసింది వారేనని చెప్పుకొచ్చింది. తాను ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానంటే వారిద్దరే కారణమని తెలిపింది. అయితే ఆ మూవీలో నటించిన హీరో రక్షిత్‌తో ప్రేమాయణం నడిపినట్లు టాక్ వినిపించింది. అలాగే తనపై ఇటీవల సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయని తెలిపింది. ఇకపై అలాంటి వాటిని సహించబోనని చెబుతోంది నేషనల్ క్రష్. సడన్‌గా రిషబ్‌, రక్షిత్‌పై పాజిటివ్ కామెంట్స్ చేయడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)