Breaking News

ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా.. క్లాప్ కొట్టిన రష్మిక!

Published on Thu, 05/15/2025 - 16:44

బేబీ మూవీతో సూపర్ హిట్‌ కొట్టిన జోడీ ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య. వీరిద్దరి క్రేజీ కాంబో మరోసారి రిపీట్ కానుంది. ఆనంద్, వైష్ణవి మరోసారి లవ్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.  తాజాగా కొత్త సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్‌లో నిర్వహించిన పూజా కార్యక్రమానికి నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నా క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలను నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పంచుకుంది.

ఈ కార్యక్రమంలో రష్మిక మందన్నా క్లాప్ కొట్టగా.. శివాజీ కెమెరా స్విచ్చాన్ చేయగా.. డైరెక్టర్స్ వెంకీ అట్లూరి. కళ్యాణ్ శంకర్ స్క్రిప్ట్ అందించారు. జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని మేకర్స్ తెలిపారు. ఈ లవ్ స్టోరీకి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.
 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)