Breaking News

ట్రెండింగ్‌లో రష్మిక మందన్న 'ఛావా' సాంగ్‌

Published on Sun, 02/02/2025 - 11:41

రష్మిక మందన్న- విక్కీ కౌశల్‌ కాంబినేషన్‌లో రానున్న హిస్టారికల్‌ మూవీ ‘ఛావా’. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ తనయుడు శంభాజీ మహారాజ్‌ జీవితం ఆధారంగా దర్శకుడు లక్మణ్‌ ఉటేకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్‌ నటించగా, శంభాజీ మహారాజ్‌ భార్య మహారాణి ఏసుబాయి పాత్రలో రష్మికా మందన్నా నటించారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్‌ యూట్యూబ్‌లో ‍ట్రెండ్‌ అవుతుంది. సుమారు 35 మిలియన్ల వ్యూస్‌తో నెట్టింట వైరల్‌ అవుతుంది. సాంగ్‌లో విజువల్స్‌ అద్భుతంగా ఉండటంతో  ఈ సాంగ్‌ ప్రేక్షకులను మెప్పిస్తుంది.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ రావడంతో చిత్ర యూనిట్‌ కూడా భారీగా ప్రమోషన్స్‌ కార్యక్రమాలను చేపడుతుంది. మొగల్‌ షెహన్షా ఔరంగజేబు పాత్రలో అక్షయ్‌ ఖన్నా నటిస్తున్నారు. దినేష్‌ విజన్‌ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్‌ రెహమాన్‌ అందించారు.

తాజాగా ఛావా సినిమా ప్రమోషన్స్‌ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. అయితే,  నడవలేని స్థితిలో ఉన్న రష్మిక ఈవెంట్‌లో పాల్గొనడంతో  అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.  నిన్న జరిగిన ఈవెంట్‌లో కూడా బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ వీల్‌చైర్‌లో స్టేజీపైకి తీసుకొచ్చాడు. అనంతరం రష్మిక.. అతడికి మంగళహారతిచ్చింది. అంతేకాదు.. విక్కీ కౌశల్‌ (Vicky Kaushal)కు కొంత తెలుగు కూడా నేర్పించింది. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)