Breaking News

రష్మిక రెమ్యునరేషన్‌ రూ. 15 కోట్లు!

Published on Thu, 06/04/2026 - 14:49

సినిమా ఒక్కసారి ముద్దుగా అక్కున చేర్చుకుంది అంటే ఊహించనంత తీరాలకు తీసుకెళ్లి కూర్చో పెడుతుంది. అలాంటి వారిలో రష్మికమందన్నా ఒకరు. ఎక్కడో కర్ణాటకలోని గ్రామంలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ మొదట్లో మాతృభాషలో కథానాయకిగా పరిచయమయ్యారు. ఆ తరువాత టాలీవుడ్‌లోకి దిగుమతి అయి గీత గోవిందం చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.

ఆ తరువాత పుష్ప చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో ఫేమస్‌ అయ్యారు. ఇక గుడ్‌బై చిత్రంతో బాలీవుడ్లో పాగా వేసిన రష్మిక యానిమల్‌ చిత్రంతో కమర్షియల్‌గా సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఆ తరువాత ఒకటి రెండు చిత్రాలు ఫ్లాప్‌ అయినా కేరీర్‌కు వచ్చే డోకా ఏమీ ఉండదు. రష్మిక విషయంలో ఇదే జరుగుతోంది. సల్మాన్‌ఖాన్‌కు జంటగా నటించిన చిత్రం నిరాశ పరిచింది. ఇటీవల నటుడు విజయ్‌ దేవరకొండను ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.

ఇక్కడ పెళ్లి అయిన హీరోయిన్లకు కెరీర్‌ దెబ్బ తింటుందన్న ఆనవాయితీని ఈ బ్యూటీ తిరగరాశారు. ఇప్పుడు ఈ క్రేజీ భామ రేంజ్‌కు వరుసగా భారీ అవకాశాలు రావడమే కాదు పారితోషికాన్ని భారీ మొత్తంలో ముట్టచెబుతున్నారు. అది ఎంతగా అంటే ఇప్పటి వరకు దక్షిణాది టాప్‌ హీరోయిన్లు తీసుకుంటున్న పారితోషికాన్ని బీట్‌ చేసేంతగా. ఇప్పటి వరకు దక్షిణాది హీరోయిన్లలో అత్యధికంగా నయనతార రూ.10 కోట్ల తీసుకుంటున్న ప్రచారం జరుగుతోంది. 

రష్మిక ఇప్పుడు కాక్‌–టెయిల్‌–2 చిత్రంలో రూ.15 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇదే నిజమైతే పారితోషికం విషయంలో ఈ అమ్మడు నయనతారను బీట్‌ చేసినట్లే అవుతుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)