Breaking News

8 ఏళ్లు ఎంత బాధపెట్టినా మౌనంగా భరించా.. ఇకనావల్ల కాదు!

Published on Thu, 03/12/2026 - 18:12

స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నా మనసుపడ్డవాడిని పెళ్లి చేసుకుని కొత్త జీవితానికి నాంది పలికింది. ఫిబ్రవరి 26ప ఉదయ్‌పూర్‌లో తెలుగు హీరో విజయ్‌దేవరకొండను పెళ్లాడింది. ఈ సంతోషకర సమయంలో ఆమె తల్లి సుమన్‌ మందన్నాకు సంబంధించిన ఓ పాత ఆడియో క్లిప్‌ కటి నెట్టింట తెగ వైరలవుతోంది. దీన్ని ఆధారంగా చేసుకుని చాలామంది రష్మిక గురించి, ఆమె కుటుంబం గురించి సోషల్‌ మీడియాలో అసత్యప్రచారాలు చేస్తున్నారు. ఈ విషయంపై రష్మిక ఆగ్రహం వ్యక్తం చేసింది.

అన్నీభరించా..
ఒక మీడియా వర్గం ఎనిమిదేళ్లుగా నాపై అసత్యప్రచారం చేస్తూ, నన్ను టార్గెట్‌ చేస్తూ వేధిస్తూనే ఉంది. వాళ్ల వ్యూస్‌, రీచ్‌ కోసం నేను అనని మాటల్ని కూడా అన్నట్లుగా తప్పుడు కథనాల్ని రాసింది. అది నన్నెంతో బాధపెట్టినా నేను మౌనంగా ఉన్నాను. కానీ గడిచిన 24 గంటల్లో వారు హద్దులు దాటి నాపై తీవ్ర దుష్ప్రచారం చేశారు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ ప్రైవేటు సంభాషణలోని కొంత భాగాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారు. 

ఎంతదూరం వెళ్తారు?
ఇప్పుడు నా జీవితంలో మార్పు చేసుకున్న పరిణామాల కారణంగా కావాలనే వాటిని వైరల్‌ చేస్తున్నారు. ఇంకా ఎంతదూరం వెళ్తారు? మీరిలా చేయడం వల్ల నా కుటుంబసభ్యులే కాకుండా నాకు సంబంధం ఉన్న వ్యక్తుల్ని కూడా ఇబ్బందిపెడుతున్నారు. ఇది నా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేకాదు, నా ప్రతిష్టను దిగజార్చడమే అవుతుంది. మేమిద్దరం (రక్షిత్‌, నేను) ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉన్నాం. 

24 గంటల్లో డిలీట్‌
అయినా సరే కొందరు కావాలని వివాదం సృష్టిస్తున్నారు, విషాన్ని చిమ్ముతున్నారు. ఎనిమిదేళ్లుగా మీరేం చేసినా మౌనంగా ఉన్నాను. కానీ, ఈరోజు మిగతావారిని కూడా ఇందులోకి లాగుతూ హద్దులు దాటి ప్రవర్తించారు. ఇక నేను సహనంగా ఉండలేను. మీడియా సంస్థలు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు వెంటనే తప్పుడు కథనాల్ని తొలగించండి. మీకు 24 గంటలు టైం ఇస్తున్నా.. ఆలోపు వాటిని తొలగించకపోతే రేపటి నుంచి సంబంధిత వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది.

వివాదం ఏంటి?
2016లో కిరిక్‌ పార్టీ మూవీ షూటింగ్‌లో రష్మిక, రక్షిత్‌ శెట్టి ప్రేమలో పడ్డారు. ఆ మరుసటి ఏడాది నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ, ఆ ప్రేమ పట్టాలెక్కకముందే 2018లో ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే ఆ సమయంలో రష్మిక ఎదుర్కొన్న వేధింపుల గురించి ఆమె తల్లి మాట్లాడినట్లుగా ఓ ఆడియో వైరలవుతోంది. దాదాపు ఎనిమిదేళ్ల కిందటి సంభాషణను ఇప్పుడు రష్మిక పెళ్లి జరిగిన సమయంలో బయటపెట్టడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)