వైభవంగా... ఆహ్లాదకరంగా విరోష్‌ వివాహం

Published on Fri, 02/27/2026 - 00:32

‘గీత గోవిందం’ సినిమాలో హీరో హీరోయిన్లుగా పెళ్లి పీటల మీద కూర్చున్న విజయ్‌ దేవరకొండ – రష్మికా మందన్నా నిజ జీవితంలో ఏడడుగులు వేశారు. ముందు స్నేహితులై, ఆ తర్వాత ప్రేమికులుగా మారి, ఫిబ్రవరి 26న ‘విరోష్‌’ (ఫ్యాన్స్‌ ఈ ఇద్దర్నీ అలానే పిలుస్తారు. తమ వివాహ వేడుకకు ఆ పేరునే పెట్టారు విజయ్‌–రష్మిక) భార్యాభర్తలయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్‌ ప్యాలెస్‌లో ఉదయం 10 గంటల 10 నిమిషాలకు వైభవంగా, ఆహ్లాదకరంగా జరిగింది.

ఉదయం తెలుగు, సాయంత్రం కొడవ (కర్ణాటకకు చెందిన కొడగు జిల్లా రష్మిక సొంతూరు) సంప్రదాయం పరంగా పెళ్లి వేడుకలు జరిగాయి. దండలు మార్చుకున్నప్పుడు వధూవరులిద్దరూ ఆనందబాష్పాలతో ఉద్వేగానికి గురయ్యారు. భావోద్వేగాలు, చిరునవ్వులు మధ్య జరిగిన ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నవారు నూతన వధూవరులిద్దర్నీ ఆశీర్వదించారు. పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇక సోషల్‌ మీడియా వేదికగా విజయ్‌ దేవరకొండ–రష్మికా మందన్నా తమ పెళ్లి ఫొటోలను షేర్‌ చేసి, ఒకరిపట్ల మరొకరికి ఉన్న మమకారాన్ని, నమ్మకాన్ని, ఇష్టాన్ని పంచుకున్నారు.

ప్రాణ స్నేహితురాల్ని భార్యను చేసుకున్నాను: విజయ్‌ 
‘‘ఒక రోజు ఆమెను నేను మిస్‌ అయ్యాను... ఆమె పక్కన ఉండి ఉంటే ఈరోజు ఇంకా బాగుండేది కదా అన్నంతగా ఆమెని మిస్‌ అయ్యాను. ఒకవేళ ఆమె నా పక్కన కూర్చుని ఉంటే.. నా భోజనం ఇంకా పరిపూర్ణంగా అనిపించేది కదా అనిపించింది... అలాగే నాతో కలిసి ఆమె వర్కవుట్స్‌ చేస్తే అది పనిష్‌మెంట్‌లా కాకుండా ఫన్‌లా ఉండేది అనిపించింది. నా జీవితానికి ఆమె అవసరం అనిపించింది. నేను ఎక్కడ ఉన్నా ఇంట్లో ఉన్న అనుభూతిని, ప్రశాంతతను ఇచ్చే ‘ఇల్లు’ అంటే తనే అని నాకు అర్థమైంది. అందుకే నేను నా ప్రాణ స్నేహితురాల్ని నా భార్యను చేసుకున్నాను... 26.02.2026’’ అని విజయ్‌ దేవరకొండ పేర్కొన్నారు.  


 

 

విజ్జూ... మాటలు సరిపోవడం లేదు: రష్మిక
హాయ్‌ మై లవ్స్, ఇప్పుడు మీకు ‘నా భర్త’ని పరిచయం చేస్తున్నాను!  
మిస్టర్‌ విజయ్‌ దేవరకొండ!!  
నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు నేర్పించిన వ్యక్తి. ప్రశాంతంగా ఉంటే ఎలా ఉంటుందో నాకు చూపించిన వ్యక్తి. ప్రతి రోజూ పెద్ద కలలు కనడం మంచిదే అనీ, ఆ కలను సాకారం చేసుకునే సామర్థ్యం నీకు ఉందని చెప్పిన వ్యక్తి. ఎవరూ నన్ను చూడడంలేదనుకుంటూ నేను డ్యాన్స్‌ చేస్తుంటే నన్ను ఆపని వ్యక్తి. అలాగే స్నేహితులతో ప్రయాణం చేయడం ఎంత బాగుంటుందో చూపించిన వ్యక్తి. నన్ను నమ్మండి... ఈ వ్యక్తి గురించి ఓ పుస్తకం రాయొచ్చు. నేను ఎలాంటి స్త్రీగా ఉండాలని కలలు కన్నానో అలా ఉండేలా నువ్వు నన్ను మార్చావు.

విజ్జూ... నీ గురించి ఎప్పుడు ఏం చెప్పాలన్నా నాకు మాటలు సరిపోవు. నా విజయాలు, కష్టాలు, ఆనందం, విచారం, జీవితం... ఇవన్నీ హఠాత్తుగా నాకు అర్థవంతంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నందుకు.... వీటన్నింటికీ సాక్ష్యంగా నువ్వు ఉన్నందుకు...  నేను నీ భార్యను కావడం, నీ భార్యగా పిలవబడడం నాకు చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఇది పూర్తిగాపార్టీ టైమ్‌. మనిద్దరం కలిసి ఒక అందమైన జీవితాన్ని గడుపుదాం. ఐ లవ్‌ యు. 

Videos

షణ్ముఖ్ జస్వంత్ మరియు వైష్ణవి చోడిశెట్టి ఎంగేజ్‌మెంట్ వీడియో

రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి... గెస్ట్ లిస్ట్ & గ్రాండ్ ఫుడ్ మెనూ

రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి వీడియో వైరల్

టీమిండియా ఇంటికేనా.? సెమీస్ చేరాలంటే.. జింబాబ్వే & వెస్టిండీస్ పై ఎంత రన్ రేట్ గెలవాలి

ఇకపై ఫారిన్ వెళ్లక్కర్లేదు..! వారణాసితో అన్నపూర్ణ స్టూడియోస్లో గ్లోబల్ టెక్నాలజీ

బొత్స Vs టీడీపీ మంత్రులు...ఒకే ఒక్కడు మంత్రులను గడగడలాడించాడు

జెరూసలెంలో మోదీ.. 11 కీలక ప్రకటనలు

కొత్త కారు అని డ్యామేజ్ కారు అమ్మిన టాటా షోరూమ్ సిబ్బంది

భూదాన్ బాధితులకు అండగా కేటీఆర్

పవన్ పై అనుమానాలు.. మండిపడుతున్న జనసేన నేతలు

Photos

+5

ప్రియుడితో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ఇదిగో విజయ్‌ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫోటోలు

+5

ఒకదానికొకటి సంబంధమే లేదు.. మీనాక్షి చౌదరి ఫన్నీ (ఫొటోలు)

+5

థాయ్‌ల్యాండ్‌ ఏనుగులతో రీతూవర్మ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

నెల్లూరులో జనసందోహం.. కొత్త జంటకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు (ఫొటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్ పెళ్లి వేడుకలు.. అంబానీ కుటుంబం ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ముంబైలో నా వారం ఇలా గడిచింది.. మృణాల్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

#Virosh : పెళ్ళి సందడి.. ట్రెండింగ్‌లో రష్మిక మందన్న (ఫొటోలు)

+5

’విష్ణు విన్యాసం‘ సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)