Breaking News

ప్రేమ,పెళ్లిపై రష్మిక అలా.. విజయ్‌ ఇలా

Published on Thu, 12/19/2024 - 14:10

సినీ నటుల వ్యక్తిగత జీవితాలపై ఏదో ఒక రూమర్‌ వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి విషయంలో రకరకాలు పుకార్లు పుట్టుకొస్తుంటాయి. ఇలాంటి గాసిప్‌లను కొంతమంది సీరియస్‌గా తీసుకొని ఖండిస్తుంటారు. మరికొంతమంది అయితే పెద్దగా పట్టించుకోరు. పబ్లిక్‌ ఫిగర్‌గా ఉన్నప్పుడు ఇలాంటి కామన్‌లే అనుకొని వదిలేస్తుంటారు. విజయ్‌ దేవరకొండ ఆ కోవలోకి చెందిన హీరో అనే చెప్పాలి. ఆయన ప్రేమ, పెళ్లిపై చాలా రోజులుగా గాసిప్స్‌ వస్తునే ఉన్నాయి. ఓ స్టార్‌ హీరోయిన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. విజయ్‌ మాత్రం ఈ రూమర్స్‌ని పెద్దగా పట్టించుకోకుండా..తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. 

గతంలో ఒకసారి తన పెళ్లి గురించి వచ్చిన వార్తలను ఖండించాడు. ఆ తర్వాత చాలా గాసిప్స్‌ వచ్చిన స్పందించలేదు. చాలా రోజుల తర్వాత తాజాగా తన రిలేషన్‌షిప్‌ గురించి వస్తున్న వార్తలపై స్పందించాడు. ఓ జాతీయ మీడియాతో విజయ్‌ మాట్లాడుతూ..సమయం వచ్చినప్పుడు తానే తన రిలేషన్‌షిప్‌ గురించి మాట్లాడతానన్నాడు. 

‘నా రిలేషన్‌షిప్‌ గురించి ప్రపంచానికి తెలియజేయాలని నాకు అనిపించినప్పుడు నేనే ఆ విషయాన్ని బయట పెడతా. దానికంటూ ఓ సమయం రావాలి. ఆ టైం వచ్చినప్పుడు నేనే సంతోషంగా ఆ విషయాన్ని అందరితో పంచుకుంటాను. నా డేటింగ్‌ విషయంపై వస్తున్న రూమర్స్‌ని నేను పెద్దగా పట్టించుకోను. పబ్లిక్‌ ఫిగర్‌గా ఉన్నప్పుడు వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తారు. అది కూడా నా వృత్తిలో భాగంగానే భావిస్తాను. ఆ రూమర్స్‌ నాపై ఎలాంటి ఒత్తిడిని కలిగించవు. వార్తలను వార్తగానే చూస్తా’ అని విజయ్‌ అన్నారు. 

ఇక ప్రేమ గురించి మాట్లాడుతూ.. ‘అపరిమితమైన ప్రేమ ఉంటే..దానికి తోడుగా బాధ కూడా ఉంటుంది. మీరు ఎవరినైనా అమితంగా ప్రేమిస్తే బాధను కూడా మోయాల్సి వస్తుంది’ అని విజయ్‌ చెప్పుకొచ్చాడు.

ఇక మరో ఇంటర్వ్యూలో హీరోయిన్‌ రష్మిక మందన్నా తన ప్రేమ, రిలేషన్‌ గురించి మాట్లాడుతూ.. తనకు రాబోయే భాగస్వామి ఎలా ఉండాలో చెప్పింది. ‘లైఫ్‌ పార్ట్‌నర్‌ అనేవాడు అన్ని వేళలా నాకు తోడుగా నిలవాలి. కష్ట సమయంలో నాకు సపోర్ట్‌గా ఉండాలి. మంచి మనసు కలిగి ఉండాలి.  ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి’ అని చెప్పింది. ఇక ప్రేమ గురించి మాట్లాడుతూ.. సా దృష్టింలో ప్రేమలో ఉన్నారంటే.. వాళ్లు తమ భాగస్వామితో కలిసి ఉన్నట్లే. జీవితంలో ప్రతి ఒక్కరికి తోడు కావాలి. తోడు లేకపోతే జీవితానికి ప్రయోజనమే ఉండదు’ అని రష్మిక అ‍న్నారు. 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)