Breaking News

సక్సెస్‌ కోసం ఆ విషయాల్లో రాజీ పడ్డాను : రష్మిక

Published on Sat, 01/25/2025 - 13:25

నేషనల్‌ క్రష్‌ రష్మిక(rashmika mandanna) ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవల పుష్ప 2(pushpa 2)తో భారీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న ఈ బ్యూటీ.. త్వరలోనే ఛావా అనే మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇలా వరుస సినిమాల్లో నటించడం కోసం పెద్ద త్యాగమే చేశానంటోంది రష్మిక. కొన్ని విషయాల్లో రాజీ పడడం వల్లే ఈ స్థాయి సక్సెస్‌ని అందుకుంటున్నానని చెబుతోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘కెరీర్‌ పరంగా బిజీగా ఉండడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నానని బాధ పడింది. తనకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టమని.. కానీ కెరీర్‌ కోసం వాళ్లకు దూరంగా ఉండాల్సి వస్తోందని ఎమోషల్‌ అయింది.

‘ఫ్యామిలీనే నా బలం. ఎక్కువ సమయం కుటుంబంతోనే గడిపేదాన్ని. నా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి రోజు చాటింగ్‌ చేసుకుంటాం. కానీ షూటింగ్స్‌ కారణంగా తనను కలువలేకపోతున్నాను. తను చాలా స్మార్ట్‌. రానున్న రోజుల్లో అద్భుతమైన మహిళగా మారనుందని నమ్ముతున్నా. ‘వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలకు ఒకేసారి సమయాన్ని కేటాయించడం అంత సులభం కాదు. ఒకదాని కోసం మరొకటి త్యాగం చేయాల్సి ఉంటుంది’ అని మొదట్లోనే మా అమ్మ చెప్పింది. నా విషయంలో ఇప్పుడు అదే జరుగుతుంది. వృత్తిపరమైన కమిట్‌మెంట్స్‌ నిలబెట్టుకోవడానికి ఫ్యామిలీ టైమ్‌ త్యాగం చేయాల్సి వస్తోంది. వీలున్నప్పుడల్లా కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి మాట్లాడుతుంటా’ అని రష్మిక చెప్పుకొచ్చింది.

సినిమాల విషయాలకొస్తే.. ప్రస్తుతం  లక్ష్మణ్ ఉదేకర్ దర్శకత్వంలో ఛావా(Chhava) అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవితం ఆధారంగా  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్కీ కౌశల్‌ హీరోగా నటిస్తున్నాడు.  ఇందులో శంభాజీ భార్య ఏసుబాయిగా రష్మిక నటిస్తోంది. ఫిబ్రవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు ‘సికందర్‌’, ‘థామ’, ‘కుబేర’, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’, ‘రెయిన్‌ బో’ చిత్రాల్లో రష్మిక నటిస్తున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)