Breaking News

అప్పుడు శ్రీరాముడు... ఇప్పుడు దశరథుడు 

Published on Thu, 10/08/2026 - 00:46

అరుణ్‌ గోవిల్‌ పేరు చెప్పగానే నాటి తరం ప్రేక్షకులకు ‘రామాయణ్‌’ సీరియల్‌ గుర్తుకొస్తుంది. అందులో శ్రీ రాముడిగా చక్కని ఆహార్యం, అద్భుతమైన నటనతో అరుణ్‌ గోవిల్‌ చెరగని ముద్ర వేసుకున్నారు. అప్పుడు రాముడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ నటుడు ఇప్పుడు రాముడి తండ్రి దశరథుడిగా కనిపించనున్నారు. నితీష్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’లో శ్రీరాముడిగా రణ్‌బీర్‌ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. 

అయోధ్య రాజు దశరథుడిగా అరుణ్‌ గోవిల్‌ కనిపించనున్నారు. ఈ పాత్ర లుక్‌ పోస్టర్‌ని బుధవారం విడుదల చేశారు. ‘ఒక తరం కోసం ఆయన రాముడికి ప్రాణం పోశారు. ఇప్పుడు ‘రామాయణ’ ప్రపంచంలోకి అయోధ్య రాజుగా తిరిగి వస్తున్నారు. దశరథుడిగా అరుణ్‌ గోవిల్‌’ అంటూ ఈ పోస్టర్‌ను షేర్‌ చేసింది యూనిట్‌. నమిత్‌ మల్హోత్రా, యశ్‌ నిర్మిస్తున్న ‘రామాయణ’ రెండు భాగాలుగా రానుంది. తొలి భాగం ప్రపంచవ్యాప్తంగా 2026 నవంబర్‌ 5న, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానున్నాయి. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.  

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)