Breaking News

‘ఆదిపురుష్‌’లో రావణుడిని వీధి రౌడీలా చూపించడం బాధేసింది: ‘రామాయణ్‌’సీత

Published on Sun, 06/09/2024 - 12:25

రామాయణం ఇతిహాసం ఆధారంగా ప్రభాస్‌ ప్రధాన పాత్రలో బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్‌’. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దారణంగా  బోల్తా పడింది.అంతేకాదు ఈ మూవీలోని ప్రధాన పాత్రలను తీర్చిదిద్దిన విధానంపై అనేక విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సైఫ్‌ అలీఖాన్‌ పోషించిన రావణాసూరుడు పాత్రపై ఎన్నో వివాదాలు వచ్చాయి. రామాయణ ఇతిహాసాన్ని అపహాస్యం చేసేలా చిత్రాన్ని తెరకెక్కించారని ఓ వర్గం మండిపడింది. తాజాగా  ‘రామాయణ్‌’ సీరియల్‌లో సీతగా నటించిన దీపికా చిఖ్లియా కూడా ‘ఆదిపురుష్‌’సినిమాపై తీవ్ర విమర్శలు చేసింది. 

ఈ సినిమాలో రావణుడిని వీధి రౌడీలా చూపించారని మండిపడ్డారు. ‘ఆదిపురుష్‌ సినిమా చూసి నేటి తరం పిల్లలు రామాయణం అంటే ఇలానే ఉంటుందని భావించే అవకాశం ఉంది. అది భవిష్యత్తుకే ప్రమాదకరం. ఇందులో చూపించినట్లుగా రావణుడు మరీ అంత చెడ్డవాడు కాదు. ఆయన గొప్ప శివ భక్తుడు. ఆయనలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. మాంసాహారం తినడు. సీతాదేవిని అపహరించడమే ఆయన చేసిన పెద్ద తప్పు. సీతాదేవి కూడా అలా ఉండదు. 

ఈ సినిమాలో చూపించినట్లుగా రావణుడు ఉండడని పిల్లలకు ఎవరూ వివరించడం లేదు. నేను ఈ సినిమాను థియేటర్‌లో చూడలేదు. టీవీలో కొంచెం చూడగానే నచ్చలేదు. సృజనాత్మకంగా ఏదో కొత్తగా చూపించాలనే తాపత్రయంలో రామాయణం గొప్పతనాన్ని తగ్గించేస్తున్నారు’ అని దీపికా చిఖ్లియా ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా, కృతీశెట్టి సీతగా నటించారు.

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)