Breaking News

శుభ్రంగా ఉన్నాను...వల్గర్‌ అంటావేంటి? రిపోర్టర్‌పై హీరోయిన్‌ అసహనం

Published on Wed, 04/26/2023 - 16:04

రవితేజ ‘ఖిలాడీ’ సినిమాలో తనదైన అందం, యాక్టింగ్‌తో యువత గుండెలను కొల్లగొట్టిన బ్యూటీ డింపుల్‌ హయాతి. ప్రస్తుతం ఈ భామ మ్యాచోస్టార్‌ గోపిచంద్‌ హీరోగా తెరకెక్కిన ‘రామబాణం’లో నటించింది. ఈ సినిమా మే 5వ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్‌పై హీరోయన్‌ డింపుల్‌ హయాతి అసహనం వ్యక్తం చేసింది. 

రామబాణం టీమ్‌ బుధవారం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హీరో గోపీచంద్‌, హీరోయిన్‌ డింపుల్‌ హయాతి,  దర్శకుడు శ్రీవాస్‌తో పాటు మిగిలిన టీమ్‌ సభ్యులంతా మాట్లాడారు. అనంతరం మీడియా ప్రతినిధులు ఒక్కొక్కరు చిత్ర బృందాన్ని ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్‌ ‘ఈ మధ్య డైరెక్టర్లు చాలా మంది హీరోయిన్ల క్యారెక్టర్లను డిఫరెంట్‌గా క్రియేట్ చేస్తున్నారు. కొత్త జానర్లలో చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కొంచెం వల్గర్‌గా ఉన్నట్టు అనిపిస్తోంది. కొంచెం రొమాంటిక్‌గా అనిపిస్తోంది. ఫ్యామిలీ సీన్స్ ఉన్నా కానీ.. మీ క్యారెక్టర్ డిజైన్ ఎలా ఉంటుంది?’ అని హీరోయిన్‌ని అడిగారు.

(చదవండి: వెయ్యి కోట్లు నమోదు చేసే సినిమా ఏదీ?)

వల్గర్‌ అనే పదం వినగానే ఒకింత అసహనానికి గురైన డింపుల్‌.. ‘వల్గర్‌ అంటారేంటి? నాకు తెలిసి సినిమాలో ఎక్కడా వల్గర్ సీన్స్ చూడలేదు. గ్లింప్సస్ కూడా అలాంటివేవీ వదల్లేదు అనుకుంటున్నాను. మా సినిమా పాటల్లో, పోస్టర్లలో నేను శుభ్రంగానే ఉన్నాను. మీరు వల్గర్ అంటుంటే నిజానికి నాకు అర్థం కావడం లేదు’ అని నవ్వుతూనే తన అసహనాన్ని వ్యక్తం చేసింది.

(చదవండి: మణిరత్నం మాటలకు ఐశ్వర్య ఎమోషనల్‌.. కాళ్లకు నమస్కరించి కృతజ్ఞతలు)

దీంతో వెంటనే దర్శకుడు శ్రీవాస్‌ జోక్యం చేసుకొని .. ‘ఈ ప్రెస్‌ మీట్‌కి ఆమె వేసుకొన్ని డ్రెస్‌ చూస్తేనే ఆమె క్యారెక్టర్‌ ఎలా ఉండబోతుందో అర్థమైపోతుంది. ఇదొక ఒక ట్రెడిషనల్ సినిమా. ట్రెడిషనల్‌గా ఉండాలని వెస్టరన్ డ్రెస్‌లు నేను వేసుకోనండి అని సంప్రదాయ దుస్తుల్లో ప్రచార కార్యక్రమాలకు వస్తోంది. వీటిని బట్టి సినిమాలో ఆ అమ్మాయి క్యారెక్టర్ డెప్త్ ఏంటో అర్థమవ్వాలి’ అని కాస్త ఘాటుగానే సమాధానమిచ్చాడు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)