Breaking News

చిరంజీవిపై రామ్‌ గోపాల్‌ వర్మ ఆసక్తికర ట్వీట్‌!

Published on Fri, 08/11/2023 - 15:47

సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్‌ రామ్‌ గోపాల్‌ వర్మ. ఆయన తీసే సినిమాలే కాదు సోషల్‌ మీడియాలో పెట్టే పోస్టులు కూడా వివాదస్పదం అవుతుంటాయి. ఏ అంశంపైనా అయినా కాస్త వ్యంగ్యంగా స్పందించడం ఆయనకు అలవాటు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవిపై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. 

మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘భోళా శంకర్‌’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ సూపర్‌ హిట్‌ వేదాళంగా తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రానికి ఫస్ట్‌ షో నుంచే నెగెటివ్‌ టాక్‌ వినిపించింది. సాధారణ ప్రేక్షకులతో పాటు మెగా అభిమానులు కూడా ఈ చిత్రం పట్ల అసంతృప్తిగానే ఉన్నారు. చిరంజీవి ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేసేలా ఈ చిత్రం ఉందని కొంతమంది మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ చిత్రం విడుదలకు ముందు హైపర్‌ ఆది చేసిన కామెంట్స్‌ బాగా వైరల్‌ అయ్యాయి. ప్రిరిలీజ్‌ ఈవెంట్‌లో మెగాస్టార్‌ని పొగడ్తలతో ముంచేశాడు. సినిమా వేదికపై రాజకీయాలు మాట్లాడుతూ..మెగా ఫ్యామిలీపై భక్తిని చాటుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆది స్పీచ్‌పై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 

(చదవండి: భోళా శంకర్‌ మూవీ రివ్యూ)

రియాల్టీకి దూరమవుతున్నారు: ఆర్జీవీ
ఇక భారీ అంచనాల మధ్య ఈ చిత్రం విడుదలై డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకోవడంతో నెట్టింట మరోసారి ‘భోళా శంకర్‌’పై చర్చ మొదలైంది. సినిమా ప్రమోషన్స్‌లో కొంతమంది అతిగా మాట్లాడారనే అభిప్రాయం వ్యక్తం చేస్తునారు. మెగాస్టార్‌ చిరంజీవి కూడా కొంతమంది పొగడ్తలకు పడిపోయి, కథల ఎంపిక విషయంలో పొరపాటు చేస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది.

ఇక ఇలాంటి విషయాలపై చాలా చురుగ్గా స్పందించే ఆర్జీవీ.. తాజాగా ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. పొగడ్తలకు అలవాటు పడిపోయి రియాల్టీకి దూరమవుతున్నారని అనిపిస్తోందంటూ పరోక్షంగా చిరంజీవిని విమర్శించాడు. ‘జబర్ , హైపర్ లాంటి ఆస్థాన విదూషకుల  భజన పొగడ్తలకి అలవాటుపడిపోయి , రియాల్టీ కి మెగా దూరమవుతున్నారని అనిపిస్తోంది’అని  ఆర్జీవీ ట్వీట్‌ చేశాడు. ఆ తర్వాత దానికి కొనసాగింపుగా ‘పొగడ్తలతో ముంచే వాళ్ళ బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వాళ్ళు ఉండరు... రియాల్టీ తెలిసే లోపల రాజు గారు మునిగిపోతారు .. వాళ్ళ పొగడ్తల విషం నుంచి తప్పించుకోవాలంటే ఆ జాతిని మైల్ దూరం పెట్టటమే’ అని ఆర్జీవీ రాసుకొచ్చాడు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)