Breaking News

'వ్యూహం' కోసం ఎవరి పర్మిషన్ అవసరం లేదు.. వర్మ సంచలన కామెంట్లు

Published on Fri, 10/13/2023 - 14:11

సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  ‘వ్యూహం’ అనే సినిమాని తెరకెక్కిస్తున్న విషం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఆయన తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే ఆయన పలు బయోపిక్‌ సినిమాలను ఉన్నది ఉన్నట్లుగా తీసి మంచి గుర్తింపు పొందాడు. తాజాగా వ్యూహం, శపథం అనే రెండు భాగాలతో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్‌ మోహన్‌ రెడ్డి గార్ల జీవిత చరిత్రలను ఆయన తెరకెక్కిస్తున్నాడు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. 'ఈ సినిమా వెనుక ఎలాంటి వ్యూహం లేదు. ఈ మూవీలో నిజం మాత్రమే ఉంది. వ్యూహం రెండు భాగాలుగా వస్తుంది. వైఎస్  రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలతో ఈ రెండు సినిమాలు ఉంటాయి. నేను చాలా సౌమ్యుడిని. నేను ఎప్పుడు చంద్రబాబుని కలవలేదు. నాకు జగన్ గారు అంటే ఒక అభిప్రాయం ఉంది. అలాగే చంద్రబాబు గారు అంటే కూడా ఒక అభిప్రాయం ఉంది. కానీ నిజమనేది మాత్రమే ఈ సినిమాలో ప్రజలు చూస్తారు. జగన్ గారి మీద నాకు ఉన్న అభిప్రాయం వ్యూహం సినిమాలో కనపడుతుంది.

మిగతా వారిపై నాకు ఎలాంటి అభిప్రాయం లేదు... నేను వేరే వాళ్ల మీద సినిమా తియ్యమంటే తియ్యను. ఈ సినిమాలో నేను నమ్మిన నిజం ఉంది. పబ్లిక్ డొమైన్‌లో ఉన్న జీవితాలను సినిమా తియ్యడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. నేను గతంలో లక్ష్మిస్ ఎన్టీఆర్ , సర్కార్ వంటి సినిమాలు అలా తీసినవే. నేను జగన్ గారి మీద ఉన్న అభిమానంతో సినిమా తీశాను. కానీ ఇక్కడ ప్యాకేజ్ అనేదానికి ఆస్కారం లేదు. నాకు టీడీపీ గురించి కానీ వైసీపీ గురించి కానీ వేరే పార్టీ గురించి కానీ తెలీదు. నేను నమ్మిన నిజం మాత్రమే సినిమాలో చూపిస్తున్నాను. నా రీసెర్చ్‌లో వెనుక ఏమి జరిగింది అనేదే ఈ సినిమా. ఈ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి గారి పాత్ర కూడా ఉంది.

ఆ కష్టాలు జగన్‌ గారు మాత్రమే పడ్డారు

దేశంలో ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా పడని కష్టాలు వైఎస్‌ జగన్ గారు పడ్డారు. అందుకే ఈ సినిమా తిస్తున్నట్లు వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ చెప్పారు.  కూడు గుడ్డ లేని వారికి పేద ప్రజల సంక్షేమానికి జగన్ గారి ప్రభుత్వం ఎంతో చేస్తుంది. దీంతో ఆయన ప్రజల గుండెళ్లో చిరస్థాయిగా ఉంటారు. ప్రజలు మళ్లీ వైఎస్‌ జగన్ గారికే పట్టం కడతారు. ఇదే తథ్యం అని కిరణ్‌ కుమార్‌ అన్నారు.

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)