Breaking News

‘సిండికేట్’తో నా పాపాలన్నీ కడిగేసుకుంటా: ఆర్జీవీ

Published on Thu, 01/23/2025 - 09:44

ఈ మధ్యకాలంలో రామ్‌ గోపాల్‌ వర్మ(Ram Gopal Varma) తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ..ఒకప్పుడు మాత్రం ఆర్జీవీ సినిమాలు ట్రెండ్‌ సెట్‌ చేశాయి. శివ, సత్య, సర్కార్‌, రంగీలా లాంటి సినిమాల గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. అలాంటి కల్ట్‌,క్లాసిక్స్‌ చిత్రాలను తెరకెక్కించిన ఆర్జీవీ.. ఇటీవల మాత్రం ఆ స్థాయి సినిమాలను తీయలేకపోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు. 27 ఏళ్ల తర్వాత తను తీసిన సత్య సినిమా మరోసారి చూశానని, కన్నీళ్లు వచ్చాయని, అలాంటి సినిమాను ఎందుకు బెంచ్‌ మార్క్‌గా పెట్టుకోలేకపోయానని ఆయన పశ్చాత్తాప పడ్డాడు. 

ఇకపై మంచి సినిమాలే చేస్తానని ప్రామిస్‌ చేస్తూ ట్వీట్‌ చేశాడు. అయితే కొంతమంది ఆయన ట్వీట్‌ని నమ్మితే..మరికొంత మంది ఆర్జీవీ ఇలాంటి ట్వీట్స్‌ చేయడం కొత్తేమి కాదు.. మాట మార్చడం ఆయనకు అలవాటే అనుకున్నారు.కానీ వర్మ ఈ సారి సీరియస్‌గానే చెప్పారు. గత కొంతకాలంగా నాసిరకం సినిమాలు చేస్తున్న ఆయన.. ఈ సారి ఓ భారీ ప్రాజెక్ట్‌ చేసేందుకు రెడీ అయ్యాడు. పెద్ద కాస్టింగ్‌తో పాన్‌ ఇండియా సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. తాజాగా ఆ సినిమాను అధికారికంగా ప్రకటించాడు. ఆర్జీవీ తెరకెక్కించబోతున్న ఈ కొత్త సినిమా పేరు ‘సిండికేట్‌’(Syndicate).అంతేకాదు ఈ సినిమా కాన్సెప్ట్ కూడా చెప్పుకొచ్చాడు. 

70వ దశకంలో భారత్‌ స్ట్రీట్ గ్యాంగ్స్‌తో మొదలుపెట్టి ఐసిస్ వరకు ఎన్నో రకాల సంఘ వ్యతిరేక శక్తులను చూసిందని.. ఐతే గత పది పదిహేనేళ్లుగా చెప్పుకోగదగ్గ కొత్త గ్రూప్స్ లేవని.. ఒకవేళ భవిష్యత్తులో కొత్త తరహా సంఘ వ్యతిరేక శక్తులు ఎలా ఉంటుందో ‘సిండికేట్’ రూపంలో చూపించబోతున్నానని వర్మ  ట్వీట్‌ చేశాడు. ‘ఓన్లీ మ్యాన్ కెన్ బి ద మోస్ట్ టెర్రిఫైయింగ్ యానిమల్’ అంటూ ఈ సినిమాకు ఒక ట్యాగ్ లైన్ కూడా జోడించాడు వర్మ. తాను గత కొన్నేళ్లుగా చేసిన సినిమా పాపాలన్నింటినీ కడిగేసే ఒకే ఒక్క చిత్రంగా ‘సిండికేట్’ను వర్మ అభివర్ణించాడు. ఈ సినిమాకు పని చేసే నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలో పంచుకుంటానని వర్మ వెల్లడించాడు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)