Breaking News

ప్రభాస్‌తో తొలిసారి ఛాన్స్‌.. చెప్పకుండానే తొలగించారు: రకుల్

Published on Thu, 09/12/2024 - 17:10

టాలీవుడ్‌ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో స్టార్‌ హీరోల సరసన నటించింది ముద్దుగుమ్మ. టాలీవుడ్‌లో  వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ మూవీతో ఎంట్రీ ఇచ్చిన రకుల్.. చివరిసారిగా కొండపొలం చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉన్న రకుల్‌ తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు సినిమాల గురించి మాట్లాడింది. సినిమా ఛాన్స్‌ల గురించి ఇంతకీ రకుల్ ఏమన్నారో చూద్దాం.

తెలుగులో రెబల్ స్టార్‌ ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ వచ్చిందని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. కానీ ఊహించని విధంగా తనకు చెప్పకుండానే తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది. నాకు ప్రభాస్‌తో మొదటిసారి నటించే అవకాశమొచ్చింది.. కానీ నాలుగు రోజుల పాటు షూటింగ్‌ అయ్యాక చెప్పకుండానే మరొకరితో రీప్లేస్ చేశారని రకుల్ వెల్లడించింది.

నాకు సమాచారం ఇవ్వలేదు

నా షెడ్యూల్‌ను ముగించిన తర్వాత ఢిల్లీకి వెళ్లానని.. ఆ తర్వాతే సినిమా నుంచి నన్ను తొలగించినట్లు తెలిసింది. ఈ విషయంపై కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని రకుల్ పేర్కొంది. అంతేకాకుండా మరో తెలుగు ప్రాజెక్ట్‌లోనూ ఇలాగే జరిగిందని చెప్పుకొచ్చింది. కానీ ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే తొలగించారని వెల్లడించింది. ఆ తర్వాతే నాకు ఇండస్ట్రీపై కాస్తా అవగాహన పెరిగిందని రకుల్‌ చెప్పుకొచ్చింది. అయితే ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలియనప్పుడు ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోవద్దని అనుకున్నానని తెలిపింది.

కాగా.. రకుల్ ప్రీత్ సింగ్ 2009లో కన్నడ చిత్రం గిల్లితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2014లో యారియాన్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత థాంక్ గాడ్, రన్‌వే 34, డాక్టర్ జి, దే దే ప్యార్ దే వంటి అనేక చిత్రాలలో నటించింది. ఇటీవల ఇండియన్‌-2 చిత్రంలో మెప్పించిన రకుల్ ప్రీత్ సింగ్‌.. ప్రస్తుతం దే దే ప్యార్ దే -2 చిత్రంలో నటిస్తోంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)