Breaking News

ఛాలెంజింగ్‌ పాత్రలు ఇష్టం

Published on Thu, 10/07/2021 - 01:24

‘‘కొన్ని సన్నివేశాలకో, పాటలకే పరిమితం అయ్యే పాత్రలు చేయాలనుకోవడం లేదు. ఛాలెంజింగ్‌ పాత్రలు చేయాలనుకుంటున్నాను.. అందుకే సెలెక్టివ్‌గా ఉంటున్నాను. ఓబులమ్మ పాత్ర నన్ను ఎగై్జట్‌ చేయడంతో ‘కొండపొలం’ సినిమా చేశాను’’ అని హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అన్నారు. పంజా వైష్ణవ్‌ తేజ్, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’.  బిబో శ్రీనివాస్‌ సమర్పణలో వై.రాజీవ్‌రెడ్డి, జె.సాయిబాబు నిర్మించిన ఈ సినిమా రేపు(8న) విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పంచుకున్న విశేషాలు...

► ‘కొండపొలం’ కథ చెప్పేందుకు క్రిష్‌గారు ఇంటికి వచ్చినప్పుడు నేను షార్ట్, టీషర్ట్‌లో ఉన్నాను. ‘చాలా యంగ్‌గా ఉన్నావ్‌.. వైష్ణవ్‌ తేజ్‌ పక్కన యంగ్‌  గర్ల్‌ కావాలనుకున్నా.. అలాగే ఉన్నావ్‌’ అంటూ క్రిష్‌గారు ఎగై్జట్‌ అయ్యారు. ఆయన కథ చెబుతున్నప్పుడే వెంటనే ఓకే చెప్పేశాను. గొర్రెల కాపర్ల గురించి ‘కొండపొలం’ లాంటి చిత్రం ఇంత వరకూ ఇండియాలో రాలేదు.

► ‘కొండపొలం’ లో పూర్తిస్థాయిలో గొర్రెలు కాసే పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తాను. అడవిలో గొర్రెలను కంట్రోల్‌ చేయడానికి నేను, వైష్ణవ్‌ మొదట్లో చాలా కష్టపడ్డాం. అయితే షూటింగ్‌ స్టార్ట్‌ చేసిన నాలుగైదు రోజుల్లోనే ఎలా కంట్రోల్‌ చేయాలో తెలిసింది.

 

► ‘కొండపొలం’ చూడటానికి ఈజీగా ఉంటుంది. కానీ, షూట్‌ చేయడం చాలా కష్టమైంది. కీరవాణిగారి సంగీతం అద్భుతంగా ఉంది. 

► ఈ నెల 10న నా పుట్టినరోజు. అయితే ఆ రోజు ఎటువంటి సెలబ్రేషన్స్‌ చేసుకోవడం లేదు. షూటింగ్‌లో ఉంటాను. ఓటీటీ ఆఫర్లు వస్తున్నాయి. కానీ  ఏదీ అంగీకరించలేదు. ఫీమేల్‌ ఓరియంటెడ్‌ చిత్రాలు కూడా చేయాలని ఉంది. కరణం మల్లీశ్వరీ బయోపిక్‌ చేస్తున్నాననే వార్తల్లో వాస్తవం లేదు.

► నాకు డ్రీమ్‌ రోల్‌ అంటూ ఏమీ లేదు. కానీ మనం ఒక్క సినిమా చేస్తే అది జీవితాంతం ప్రేక్షకులు గుర్తు పెట్టుకోవాలి. ఒక డీడీఎల్‌జే (దిల్‌ వాలే దుల్హానియా లేజాయేంగే), ఒక
‘బాహుబలి’ లాంటి సినిమాలు చేస్తే చాలనిపిస్తోంది. అలాంటి కేటగిరిల్లో ‘కొండపొలం’ కూడా ఉంటుందని నమ్ముతున్నాను.


సాయి తేజ్‌తో నేరుగా మాట్లాడలేదు. వైష్ణవ్‌ తేజ్‌ నుంచి తేజు ఆరోగ్య పరిస్థితి  తెలుసుకున్నాను.

Videos

అందాల యుద్ధం

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడి ఉపనయన వేడుక

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో కాదు.. సుకుమార్ తోనే ..

అల్లు అర్జున్ లేకుండా ఆర్య 3

చంద్రబాబుకు విజయసాయి రెడ్డి అమ్ముడుపోయాడు

వార్ 2 డైరెక్టర్ పై మండిపడుతున్న Jr. NTR ఫ్యాన్స్.. కారణం అదేనా

స్కాంలకు పరాకాష్ట అమరావతి పేరుతో దోపిడీనే : వైఎస్ జగన్

ఈనాడు టాయిలెట్ పేపర్ కి ఎక్కువ.. టిష్యూ పేపర్ కి తక్కువ..

చంద్రబాబు అప్పుల చిట్టా.. ఆధారాలతో బయటపెట్టిన వైఎస్ జగన్

మన యుద్ధం చంద్రబాబు ఒక్కడితో కాదు..!

Photos

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)