Breaking News

నాతో షూటింగ్‌ చేసి చివరికి వేరే హీరోయిన్‌ను తీసుకున్నారు: రకుల్‌

Published on Sat, 01/21/2023 - 08:40

నార్త్‌ నుంచి వచ్చి ముందు సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌ అయ్యారు రకుల్‌ ప్రీత్‌సింగ్‌. తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలతో దూసుకెళుతున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళంలో ‘ఇండియన్‌ 2’, ‘అయలాన్‌’లో నటిస్తున్నారు. కాగా హిందీలో ఆమె నటించిన ‘ఛత్రీవాలీ’ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఇందులో రకుల్‌ సురక్షితమైన శృంగారం గురించి పాఠాలు చెప్పే కెమిస్ట్రీ టీచర్‌గా నటించారు. ‘‘కొన్ని విషయాలను బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడం.

చదవండి: ‘మహానటి’ తర్వాత ఇంట్లో గొడవలు అయ్యాయి: సావిత్రి కూతురు

అయితే మారుతున్న కాలానికి తగ్గట్టు మనం మారాలి. పిల్లలకు అవగాహన కల్పించాలి. అందుకే ఈ సినిమా చేశాను’’ అన్నారు. ఇక.. కెరీర్‌ ఆరంభంలో తనకు ఎదురైన అనుభవాల గురించి రకుల్‌ చెబుతూ.. ‘‘ఇండస్ట్రీలో నాకు బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. ముంబైలో నేను కాండీవాలీలో ఉండేదాన్ని. కానీ నా ట్రైనర్‌తో కలిసి బాంద్రాలో ఒక కేఫ్‌లో కూర్చుని, ఏయే ఆఫీస్‌కి వెళ్లాలి? ఎన్ని ఆడిషన్స్‌ ఇవ్వాలి? అని ప్లాన్‌ చేసేదాన్ని. బాంద్రా, అంథేరీల్లో ఏమైనా ఆడిషన్స్‌ ఉంటే వెళ్లొచ్చని ఆ కేఫ్‌కి వెళ్లేదాన్ని.

చదవండి: వారి వల్లే అనసూయ జబర్దస్త్‌ నుంచి బయటకు వచ్చిందా?

బ్యాగులో కొన్ని డ్రెస్సులు పెట్టుకుని, కారులోనే మార్చుకునేదాన్ని. చాన్స్‌ వచ్చినట్లే వచ్చి చేజారేది. ఒక్కోసారి నాతో షూటింగ్‌ చేసి, వేరే హీరోయిన్‌ని తీసుకునేవారు. ఇదంతా నేను పోరాటం అనుకోలేదు. ఎందుకంటే కష్టపడకుండా ఈజీగా దక్కాలనుకునే మనస్తత్వం కాదు నాది. అందుకే ‘పోరాటం’ అనే పదం నాకు నచ్చదు. ఆ రోజు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేశాను కాబట్టే ఈరోజు ఈ స్థాయికి చేరుకోగలిగాను’’ అన్నారు. 

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)