Breaking News

దివాలా తీశామన్నారు.. రకుల్‌ భర్త జాకీ భగ్నానీ రియాక్షన్‌

Published on Sat, 07/05/2025 - 09:14

బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ(Jackky Bhagnani ) దివాలా తీశారని కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రకుల్ ప్రీత్‌ సింగ్‌(Rakul Preet Singh)ను పెళ్లాడిన తర్వాత ఆయన నిర్మించిన మొదటి సినిమా 'బడే మియాన్ చోటే మియాన్‌' వల్ల భారీగా నష్టపోవడంతో తన ఆఫీస్‌, ఇల్లు అన్నీ అమ్మేశారని పలు కథనాలు వైరల్‌ అయ్యాయి. అయితే, తాజాగా ఈ అంశం గురించి  జాకీ భగ్నానీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

'బడే మియాన్ చోటే మియాన్‌'  విడుదలైన తర్వాత తనతో పాటు కుటుంబం ఎదుర్కొన్న కష్ట సమయాల గురించి ఆయన రకుల్‌ భర్త జాకీ ఇలా మాట్లాడారు. ' నేను నా జుహు కార్యాలయాన్ని తనఖా పెట్టిన మాట వాస్తవమే.. కానీ, ఇప్పుడు మళ్లీ తిరిగి సొంతం చేసుకున్నాను. గతంలో వార్తల్లో నిలిచిన భవనం ఇదే. నేను దివాళా తీయడం వల్ల దానిని అమ్మాల్సి వచ్చిందని, ఆహారం కొనడానికి కూడా నా దగ్గర డబ్బు లేదని వారు చెప్పారు. నేను పారిపోయానని వారు చెప్పారు. ఈ పుకార్లకు నేను ఎవరినీ నిందించాలనుకోవడం లేదు, కానీ అవి ఎలా ప్రారంభమయ్యాయో నాకు తెలియదు. అయితే, వాటి వల్ల నా కుటుంబం బాగా ఇబ్బంది పడింది. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాను.' అని ఆయన అన్నారు. ఇదే సమయంలో 'బడే మియాన్ చోటే మియాన్‌' సినిమా కోసం దర్శకుడిగా అలీ అబ్బాస్‌ జాఫర్‌ను ఎంపిక చేసి తప్పుచేశానని ఆయన అన్నారు.

జాకీ భగ్నానీ సొంత బ్యానర్‌ పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ద్వారా బడే మియాన్ చోటే మియాన్‌ను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.59 కోట్లు మాత్రమే రాబట్టింది. దీంతో భారీ నష్టాలను ఆయన ఎదుర్కొన్నాడు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్స్‌ ఈ చిత్రంలో నటించారు. అయితే, కనీసం ఓపెనింగ్స్‌ కూడా పెద్దగా లేకపోవడంతో కనీసం రెండురోజులు కూడా సినిమా రన్‌ కాలేదు. 1986 నుంచి పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నుంచి పలు సినిమాలను జాకీ భగ్నానీ కుటుంబం నిర్మించింది. బాలీవుడ్‌లో ఈ బ్యానర్‌ నుంచి మంచి విజయాలు సాధించిన చిత్రాలు ఉన్నాయి.

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)