Breaking News

ఆయన నుంచి చాలా నేర్చుకున్నా!

Published on Sat, 06/29/2024 - 12:30

దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు, తమిళ, భాషల్లో అగ్ర కథానాయకిగా రాణించిన నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. అయితే ప్రస్తుతం ఇక్కడ ఈ అమ్మడికి అవకాశాలు బాగా తగ్గాయి. అయితే హిందీలో మాత్రం ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇకపోతే నటన కంటే గ్లామర్‌కే అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన రకుల్‌ప్రీత్‌సింగ్‌కు గ్రేట్‌ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో నటించే అవకాశం రావడం విశేషమే. నటుడు కమలహాసన్‌ కథానాయకుడిగా నటించిన ఇండియన్‌– 2 చిత్రంలో నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌  ఒక నాయకిగా నటించారు. ఇందులో ఆమె నటుడు సిద్ధార్‌్థకు జంటగా నటించినట్లు తెలుస్తోంది. 

లైకా ప్రొడక్షన్స్, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థలు నిర్మించిన ఈ చిత్రం జూలై 12వ తేదీన భారీ అంచనాల మధ్య తెరపైకి రానుంది. ఇటీవల విడుదలైన చిత్రం ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. కాగా ఇందులో నటించిన నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఒక భేటీలో పేర్కొంటూ ఇండియన్‌–2 చిత్రంలో నటిస్తున్నప్పుడు ఆ చిత్ర దర్శకుడు శంకర్‌ నుంచి తాను చాలా నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. గ్రేట్‌ దర్శకుడైన ఆయనతో కలిసి పని చేయడమే ప్రత్యేక రాయితీగా భావిస్తున్నాననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన అద్భుతమైన దర్శకుడని, కథాపాత్రలను ఆయన చూసే విధానం, ఆయన ఆలోచనా విధానం, షూటింగ్‌ స్పాట్‌లో ఆయన సృజనాత్మకత ఇలా చాలా విషయాలను తాను నేర్చుకున్నానని చెప్పారు. 

ఇండియన్‌–2 చిత్ర షూటింగ్‌ తనకు నిజంగా మరచిపోలేని అనుభవాన్ని అందించిందని రకుల్‌ప్రీత్‌సింగ్‌ పేర్కొన్నారు. కాగా అవకాశాలు తగ్గడంతో ఈమె ఇప్పుడు ఎలాంటి అవకాశం వచ్చినా దాన్ని ఉపయెగించుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో తరచూ విడుదల చేస్తూ ప్రచారం పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మధ్య శివకార్తికేయన్‌ సరసన నటించిన అయలాన్‌ చిత్రం హిట్‌ అయినా, రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదన్నది గమనార్హం. ఇంకా చెప్పాలంటే పెళ్లి అయిన తరువాత ఈమె కెరీర్‌ చాలా కుంటుపడిందనే ప్రచారం జరుగుతోంది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)