అశ్లీలతకు తావు లేకుండా ఓ మంచి సినిమాను చేశాం : హీరో రక్షిత్‌ అట్లూరి

Published on Sat, 10/04/2025 - 17:28

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’ అక్టోబర్ 10న విడుదలకు సిద్ధమైంది. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించిన ఈ చిత్రానికి సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. శనివారం జరిగిన ప్రెస్ మీట్‌లో చిత్ర బృందం సినిమా విశేషాలను పంచుకుంది.

హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ.. “మూడేళ్ల క్రితం నిర్మాత తేజ గారు ఈ కథ చెప్పారు. మొదట్లో కథ అర్థం కాలేదు, కానీ సీన్స్ నచ్చాయి. ఫాదర్-సన్ ఎమోషనల్ సీన్స్ తెలుగులో ఇంతవరకు రాని విధంగా ఉన్నాయి. శ్రీమాన్  పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. గోదావరి జిల్లాల విజువల్స్ అద్భుతంగా చిత్రీకరించిన కెమెరామెన్ సాయి కుమార్, శర్వా మ్యూజిక్, అనుదీప్ ఆర్ఆర్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. అశ్లీలత లేకుండా నిజాయితీగా మంచి సినిమా చేశాం. థియేటర్ నుంచి ఆనందంతో బయటకు వస్తారు’ అన్నారు

దర్శకుడు సాయి మోహన్: ‘ఇండస్ట్రీలోకి రావాలన్నది మా నాన్న కల. నన్ను నమ్మిన తేజకి, గౌరీకి థాంక్స్. సాయి కుమార్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. కోమలి నా రచనకు మించి నటించారు. శ్రీమాన్ సింగిల్ షాట్ సీన్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. అక్టోబర్ 10న అందరూ సినిమా చూసి సపోర్ట్ చేయాలి’ అన్నారు.

‘శశివదనే’ నాకు ప్రత్యేకమైన చిత్రం. నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది. అందరూ థియేటర్లో చూడాలి’ అని హీరోయిన్‌ కోమలి అన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)