Breaking News

నేను చనిపోతే శేఖర్‌,జానీ చేసేది ఇదే.. ముందే చెప్పిన రాకేష్‌ మాస్టర్‌

Published on Mon, 06/19/2023 - 07:52

టాలీవుడ్‌లో దాదాపు 1500 పాటలకు కొరియోగ్రఫీ చేసిన రాకేశ్‌ మాస్టర్‌ (53) ఆకస్మిక మరణంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సినీ పరిశ్రమ నుంచి ఆయనకు సోషల్‌ మీడియా ద్వార పలువురు సంతాపం ప్రకటించారు.  గతంలో ఆయన వివిధ సందర్భాల్లో పంచుకున్న విషయాలను అభిమానులు షేర్‌ చేస్తున్నారు.  రాకేష్‌ మాస్టర్‌ చనిపోయన తర్వాత ఏం జరుగుతుందో ఓ ఇంటర్వ్యూలో ముందే ఇలా చెప్పాడు.

(ఇదీ చదవండి: ఎక్కడ సమాధి చేయాలో ముందే కోరిన రాకేష్‌ మాస్టర్‌)

 'నా మరణం తర్వాత శేఖర్‌, సత్య మాస్టర్లు పూల మాలలతో వస్తారు. కానీ వారిలో బాధ కంటే సంతోషమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో వారికి ఏడుపు రాకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్నట్లు నటిస్తారు. గతంలో నేను వారి కోసం చేసిన రెండు మంచిమాటలు చెబుతూ.. ఎప్పుడెప్పుడూ డెడ్‌బాడీని తీసేస్తారా..? అక్కడి నుంచి వెళ్లిపోదామా? అని' ఉంటారని చెప్పుకొచ్చాడు.  జానీ మాస్టర్‌కు మాత్రం ఏడుద్దామని అనుకున్నా కన్నీళ్లు రావు.. దీంతో జెండూ బామ్‌ను పూసుకొని మ్యానేజ్‌ చేస్తాడని తెలిపాడు. ఇలా తన అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత వాళ్లందరూ చాలా రిలాక్స్‌ అవుతారని గతంలో తెలిపాడు.

మెడికల్‌ కాలేజీకి మృతదేహం 
తన మరణం తర్వాత డెడ్‌బాడీని మెడికల్‌ కాలేజీకి చెందాలని, అందుకు ముందే ఏర్పాట్లు చేసుకున్నానని తెలిపాడు. కాబట్టి తన శిష్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పాడు. తన అంత్యక్రియలకు వారెవరూ ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. చివరకు తన కుమారుడు కూడా చితికి నిప్పు పెట్టాల్సిన పని లేదన్నాడు. తన అస్తికలు తీసుకొని గంగానదిలో కలపాల్సిన అవసరం కూడా లేదన్నాడు. అలాంటి వాటిపై నమ్మకం లేదు.. అందుకే మరణానంతరం తన డెడ్‌బాడీని మెడికల్‌ కాలేజీకి చేరాలని నిర్ణయించుకున్నానన్నాడు. దీంతో కొంతమంది మెడికల్‌ విద్యార‍్థులకు శవ పంచనామాకు ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు. ఇలా అందరూ శరీర దానం చేయడం వల్ల మెడికల్‌ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నాడు. 

(ఇదీ చదవండి: Rakesh Master: ఆ ఒక్క మాటతో ఫేమస్‌ అయిన రాకేష్‌ మాస్టర్‌)

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)