ఐదేళ్లలో లక్షను కోటి చేసిన ఐటీ స్టాక్.. ఏకంగా 10 వేల శాతం జంప్ ...
Breaking News
ఎంటర్‌టైనింగ్‌గా 'రాకాస' ట్రైలర్
Published on Wed, 03/25/2026 - 18:29
'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలతో ఎంటర్‌టైన్ చేసిన సంతోష్ శోభన్ హీరోగా నటించిన సినిమా 'రాకాస'. మెగా డాటర్ నిహారిక నిర్మించగా.. మానస శర్మ అనే అమ్మాయి దర్శకురాలిగా పరిచయమవుతోంది. హారర్ కామెడీ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.
(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. టాలీవుడ్ ఏం నేర్చుకోవాలి?)
ట్రైలర్ బట్టి చూస్తే.. ఇదివరకు వచ్చిన హారర్ సినిమాల్లానే ఇందులో స్టోరీ ఉన్నట్లు అనిపిస్తుంది. ఏ మాత్రం సంబంధం లేని హీరో, ఓ పల్లెటూరికి వస్తాడు. అక్కడే ఉండే ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. అనుకోని విధంగా హీరో సమస్యల్లో చిక్కుకుంటాడు. బ్రహ్మ రాక్షసుడికి ఆహారంగా ఊరంతా కలిసి ఇతడిని పాడుబడ్డ కోటలోకి పంపిస్తారు. అక్కడ హీరోకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేదే స్టోరీలా అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: రేలంగి మామయ్యగా ఒకవేళ రాజశేఖర్ చేసుంటే?)
Tags : 1