Breaking News

'మమ్ముట్టి' ఆరోగ్యంపై వచ్చిన రూమర్స్‌ నిజమే : రాజ్యసభ ఎంపీ

Published on Thu, 06/19/2025 - 12:51

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty) ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్‌పై తన స్నేహితుడు, రాజ్యసభ ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ పలు వ్యాఖ్యలు చేశారు. మమ్ముట్టి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని  ఆయన తెలిపారు. కానీ, చిన్న ఆనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నాడని ఆయన పేర్కొన్నారు. మమ్ముట్టి గత కొద్ది రోజులుగా  క్యాన్సర్‌తో బాధపడుతున్నారని కథనాలొచ్చాయి. దీంతో ఆయన టీమ్‌ గతంలోనే అభిమానులకు క్లారిటీ ఇచ్చింది.  అవన్నీ ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది.

రాజ్యసభ ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ ఇలా చెప్పారు. 'మమ్ముట్టి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారనేది నిజం. కానీ, కేవలం చిన్న ఆరోగ్య సమస్యకు మాత్రమే చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన బాగానే ఉన్నారు, నేను ఇప్పుడే అతనితో ఫోన్‌లో మాట్లాడాను. మేము చాలా సంవత్సరాలుగా  స్నేహితులం, కానీ మేము ఎప్పుడూ వ్యక్తిగత విషయాలను చర్చించే రకం కాదు. ఇటీవల రోజుల్లో, మేము అలాంటి విషయాలను కూడా పంచుకుంటున్నాము.  ఆయన పూర్తి సంతోషంతో ఉన్నారు. అభిమానులు ఆందోళన  చెందాల్సిన పనిలేదు. త్వరలో సినిమా సెట్‌లో ఆయన్ను చూస్తారు.' అని ఆయన చెప్పారు.

మమ్ముట్టి, మోహన్‌లాల్‌లు నటిస్తోన్న మహేష్ నారాయణన్ సినిమా మొదటి షెడ్యూల్ శ్రీలంకలో ప్రారంభమైంది. ఈ మల్టీస్టారర్ మలయాళ చిత్రంలో ఇద్దరు పెద్ద స్టార్స్  మమ్ముట్టి, మోహన్‌లాల్‌ నటిస్తున్నారు. ఈ మూవీకి తాత్కాలికంగా ఎంఎంఎంఎన్‌ (మమ్ముట్టి, మోహన్‌లాల్, మహేష్ నారాయణన్) అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, కుంచాకో బోబన్, నయనతార, దర్శనా రాజేంద్రన్ కూడా నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్‌లోనే మమ్ముట్టి కాస్త అనారోగ్యానికి గురయ్యారు. దీంతో సినిమా షూటింగ్ నుండి విరామం తీసుకున్నారు. త్వరలో ఆయన మళ్లీ సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు.
 

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)