Breaking News

గంగూలీ బయోపిక్‌లో ఫిక్స్‌

Published on Wed, 06/25/2025 - 00:28

ప్రముఖ క్రికెటర్, టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ బయోపిక్‌కి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌కి సంబంధించిన పనులు దాదాపు నాలుగేళ్లుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో గంగూలీగా నటించనున్నారంటూ రణ్‌వీర్‌ సింగ్, ఆయుష్మాన్‌ ఖురానా వంటి నటుల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఓ కార్యక్రమంలో తన బయోపిక్‌లో రాజ్‌కుమార్‌ రావు నటించనున్నారన్న సమాచారం ఉందని, అయితే ఆయన కాల్షీట్స్‌ కేటాయింపులో కొన్ని సమస్యలు ఉన్నాయన్నట్లుగా గుంగూలీ పేర్కొన్నారు.

తాజాగా గంగూలీ బయోపిక్‌లో రాజ్‌కుమార్‌ రావు నటించనుండటం కన్ఫార్మ్‌ అయిపోయింది. ఈ బయోపిక్‌లో నటించనున్నట్లుగా రాజ్‌కుమార్‌ రావు ఓ జాతీయ ఆంగ్ల మీడియా సంస్థకు వెల్లడించి, ఆనందం వ్యక్తం చేశారు. ‘‘గంగూలీగారి బయోపిక్‌లో నటించడమనేది చాలా పెద్ద బాధ్యత. కాస్త ఆందోళనగా ఉంది. కానీ ఫుల్‌ ఫన్‌గా కూడా ఉంటుందని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు రాజ్‌కుమార్‌.

బెంగాలీకి చెందిన క్రికెటర్‌ గంగూలీ. రాజ్‌కుమార్‌ రావు భార్య పత్రలేఖ బెంగాలీ. దీంతో తన భార్య వద్ద బెంగాలీ భాషలో నైపుణ్యతను సంపాదించుకున్నారట రాజ్‌కుమార్‌. సో... భాష, ఉచ్చారణ పరంగా ఆయనకు సమస్య లేదు. ఇక తన బయోపిక్‌ చిత్రీకరణ 2026 జనవరిలో ప్రారంభమవుతుందని, అదే ఏడాది డిసెం బరులో రిలీజ్‌ కావొచ్చని ఓ సందర్భంలో గంగూలీ పేర్కొన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)