Breaking News

అందరికీ ధన్యవాదాలు

Published on Sat, 10/05/2024 - 02:41

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అస్వస్థత కారణంగా గత సోమవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన గుండెలోని రక్తనాళానికి వాపు రావడంతో వైద్యులు శస్త్ర చికిత్స లేకుండా స్టెంట్‌ అమర్చారు. శుక్రవారం ఉదయం డిశ్చార్జ్‌ అయ్యారు రజనీ. వైద్యులు ఆయనకు 15 రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కాగా రజనీ అనారోగ్యానికి గురైన విషయం తెలిసి ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

ఇక అభిమానులైతే గుళ్లు, గోపురాలు, చర్చిలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన రజనీకాంత్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ‘‘నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ నాయక మిత్రులకు, సినీ రంగానికి చెందిన స్నేహితులకు, నా క్షేమం కోరిన మీడియా మిత్రులకు, నన్ను బతికిస్తున్న ఫ్యాన్స్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని రజనీకాంత్‌ పేర్కొన్నారు.                                       – సాక్షి ప్రతినిధి, చెన్నై

ఆస్పత్రి నుంచి గోవిందా డిశ్చార్జ్‌
బాలీవుడ్‌ నటుడు గోవిందా ఈ నెల 1న తన వ్యక్తిగత తుపాకీ పొరపాటున పేలడంతో కాలికి గాయాలై ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. శుక్రవారం  వైద్యులు ఆయన్ను డిశ్చార్జ్‌ చేసి, కొన్ని రోజులపాటు బెడ్‌ రెస్ట్‌ తీసుకోవాలని సూచించారు. వీల్‌ఛైర్‌లో ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన గోవిందాను పలువురు అభిమానులు పరామర్శించారు. ‘‘ప్రస్తుతం క్షేమంగా ఉన్నాను. నేను త్వరగా కోలుకోవాలనిప్రార్థించినవారికి కృతజ్ఞతలు’’ అని గోవిందా తెలిపారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)