Breaking News

కూతురు కోసం రజనీకాంత్‌ మరో సాహసం.. ఈ సారి రిజల్ట్‌ ఏంటో?

Published on Sun, 02/11/2024 - 07:54

ఎవర్‌గ్రీన్‌ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నటుడు రజనీకాంత్‌. ఈయనకు దళపతి విజయ్‌ పోటీ అంటూ ఇటీవల ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రచారంతో నటుడు రజనీకాంత్‌ లాల్‌ సలామ్‌ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై గట్టిగానే కౌంటర్‌ ఇచ్చిన విషయం విధితమే. కాగా ఇప్పుడు విజయ్‌ రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి పార్టీ పేరును కూడా ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఒకటి రెండు చిత్రాలు చేసి నటనకు స్వస్తి పలకబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో రజనీకాంత్‌ సూపర్‌స్టార్‌ పట్టానికి మరి కొంతకాలం ఎలాంటి ఢోకా ఉండబోదనేది కోలీవుడ్‌ వర్గాల్లో జరుగుతున్న చర్చ.

ఈ విషయాన్ని పక్కన పెడితే రజనీకాంత్‌ వరుసగా చిత్రాలను చేసుకుంటూ పోతున్నారు. ఈయన ప్రస్తుతం జై భీమ్‌ చిత్ర ఫేమ్‌ జ్ఞానవేల్‌ దర్శకత్వంలో వేట్టైయాన్‌ చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత లోకేష్‌ కనకరాజ్‌తో తన 171వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. కాగా ఇటీవల తన పెద్ద కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించిన లాల్‌ సలామ్‌ చిత్రంలో రజనీకాంత్‌ అతిథిగా పవర్‌ఫుల్‌ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి..తొలి రోజే నెగెటివ్‌ టాక్‌ వచ్చింది.

ఇదిలా ఉంటే పెద్ద కూతురు చిత్రంలో నటించిన రజనీకాంత్‌ తాజాగా ఆయన చిన్న కూతురు సౌందర్య దర్శకత్వం వహించనున్న చిత్రంలోనూ అతిథి పాత్రలో నటించడానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. సౌందర్య ఇంతకు ముందే తన తండ్రి కథానాయకుడిగా కోచ్చడయాన్‌ అనే యానిమేషన్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. కాగా తాజాగా సౌందర్య రజనీకాంత్‌ మరో చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. రాఘవ లారెన్స్‌ కథానాయకుడిగా నటించిన వి.క్రియేషన్స్‌ పతాకంపై కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్నారు. ఇందులో రజనీకాంత్‌ అతిథి పాత్రలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు, ఈ చిత్రానికి పది రోజులు కాల్‌షీట్స్‌ కూడా కేటాయించినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. అయితే దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)