మీరు నా మొదటి గురువు

Published on Thu, 08/14/2025 - 01:14

‘‘మీ పక్కన నటుడిగా నా తొలి అడుగులు వేశాను. నా మొదటి గురువుల్లో మీరు ఒకరు’’ అంటూ హీరో హృతిక్‌ రోషన్‌ ఎక్స్‌ వేదికగా(ట్విట్టర్‌) ఓ పోస్ట్‌ చేశారు. రజనీకాంత్‌ హీరోగా జె. ఓం ప్రకాశ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘భగవాన్‌ దాదా’(1986). రాకేశ్‌ రోషన్‌ నిర్మించిన ఈ చిత్రంలో ఆయన తనయుడు హృతిక్‌ రోషన్‌ బాలనటుడిగా నటించారు. ‘భగవాన్‌ దాదా’ గా రజనీకాంత్‌ నటించగా, ఆయన పెంపుడు కొడుకు గోవిందా దాదాగా హృతిక్‌ నటించిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉంటే.. రజనీకాంత్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కూలీ’. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలకానుంది. అదేవిధంగా హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్‌ నటించిన చిత్రం ‘వార్‌ 2’. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ సినిమా కూడా నేడు విడుదలవుతోంది. 

‘కూలీ, వార్‌ 2’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద ఒకే రోజు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌ గురించి హృతిక్‌ రోషన్‌ పోస్ట్‌ చేయడం విశేషంగా మారింది. ‘‘రజనీకాంత్‌ సార్‌.. మీ పక్కన నటుడిగా నా తొలి అడుగులు వేశాను. నా మొదటి గురువుల్లో మీరు ఒకరు. నాకెప్పుడూ మీరు ఆదర్శం. యాభై ఏళ్ల ఆన్‌ స్క్రీన్‌ మ్యాజిక్‌ పూర్తి చేసుకున్నందుకు మీకు అభినందనలు’’ అని హృతిక్‌ రోషన్‌ పోస్ట్‌ చేశారు. 
 

Videos

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)