Breaking News

'జైలర్‌' ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. అదిరిపోయే టైటిల్‌తో సీక్వెల్‌

Published on Fri, 04/12/2024 - 20:30

రజనీకాంత్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'జైలర్‌'. అప్పటి వరకు హిట్‌ సినిమాలు లేని రజనీకాంత్‌కు జైలర్‌తో మంచి విజయాన్ని అందుకున్నారు. గతేడాది అగష్టులో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ. 600 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ సాధించింది. నిర్మాతకు కూడా భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమాగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్‌ వార్త వైరల్‌ అవుతుంది.

జైలర్‌ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌పై కళానిధి మారన్‌ నిర్మించారు. ఈ సినిమాను నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ డైరెక్ట్‌ చేయగా అనిరుధ్‌ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ పనులను డైరెక్టర్‌ ప్రారంభించారట. 'హుకుమ్‌' పేరుతో పార్ట్‌ 2 పనులను ఆయన మొదలుపెట్టేశారట. ఈ జూన్‌లో ప్రీ-ప్రొడక్షన్‌ పనులను కూడా ఆయన స్టార్ట్‌ చేయబోతున్నారని టాక్‌ ఉంది.   #Jailer2, #Hukum హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్‌మీడియాలో ఈ వార్త ట్రెండ్‌ అవుతుంది. దీంతో జైలర్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషి అవుతున్నారు.

రజనీకాంత్ ఇప్పటికే రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌కు ఏప్రిల్‌ 22న టైటిల్‌ ఖరారు కానుంది. సన్‌పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ ఈ మూవీని నిర్మిస్తున్నారు. మరోవైపు టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో 'వేట్టయాన్‌' చిత్రాన్ని కూడా రజనీ పట్టాలెక్కించిన విషయం తెలిసిందే.

జైలర్‌లో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌, మలయాళ నటుడు మోహన్‌ లాల్‌, బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రమ్యకృష్ణ, తమన్నా, సునీల్‌, మిర్నా మేనన్‌, యోగిబాబు కీలక పాత్రలలో మెప్పించారు. టైగర్‌ ముత్తువేల్‌ పాండియన్‌గా రజనీ హీరోయిజానికి ఫ్యాన్స్‌ ఫిదా అయితే.. వర్మన్‌గా వినాయకన్‌ విలనిజానికి కూడా అదే రేంజ్‌లో విజిల్స్‌ పడ్డాయి. జైలర్‌ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)