Breaking News

‘ఒరే తలైవర్‌’ అంటూ బర్త్‌డే విషెస్‌.. హీరోయిన్‌పై రజనీ ఫ్యాన్స్‌ ఫైర్‌!

Published on Sun, 12/15/2024 - 15:39

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఈ నెల 12న తన పుట్టినరోజు జరుపుకున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే నటి దుషారా విజయన్‌ ‘ఒరే తలైవర్‌’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా రజనీకాంత్‌కి చెప్పిన శుభాకాంక్షలు వివాదాస్పదం అయ్యాయి. 

 రజనీకాంత్‌ గౌరవం తగ్గించి ఒరే తలైవర్‌ అంటూ పోస్ట్‌ చేయడాన్ని తెలుగు నెటిజన్స్‌ తప్పుబట్టారు. ఒరే అంటే ఒరేయ్‌ అని తెలుగువాళ్లు అనుకున్నారు. అయితే తమిళంలో ‘ఒరే’ అంటే ఒక్కరే అని అర్థం. అందుకే ‘ఒరే తలైవర్‌’ (సూపర్‌స్టార్‌ ఒక్కరే) అనే అర్థం వచ్చేలా పోస్ట్‌ చేశారు దుషారా. అంతేకానీ రజనీని అవమానించే విధంగా ఒరే అనే పదాన్ని ఎక్కడా వాడలేదంటూ తమిళ్‌ తెలిసిన వారు సోషల్‌ మీడియా ద్వారా క్లారిటీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. 

ఇక ఫ్యాషన్‌ డిజైనర్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన దుషారా ‘బోదై ఏరి బుదద్ధి మారి’ (2019) సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తక్కువ సమయంలోనే రజనీకాంత్‌ (వేట్టయాన్‌), ధనుశ్‌ (రాయన్‌), విక్రమ్‌ (వీర ధీర శూరన్‌ 2) వంటి స్టార్‌ హీరోల సినిమాలల్లో నటించే అవకాశం అందుకున్నారు దుషారా. ఇలా కెరీర్‌ పరంగా ఈ బ్యూటీ దూసుకెళుతున్నారు. 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)