Breaking News

జైలర్‌ 2 డేట్‌ ఫిక్స్‌ 

Published on Thu, 09/25/2025 - 01:06

‘‘షూటింగ్‌ బాగా జరుగుతోంది’’ అంటూ రజనీకాంత్‌ చిరునవ్వు నవ్వుతూ మీడియాతో పేర్కొన్నారు. అలాగే తన అభిమానులను ఆనందపరిచే ఒక న్యూస్‌ కూడా చెప్పారు. ‘జైలర్‌ 2’ రిలీజ్‌ ఎప్పుడు? అని అడిగిన మీడియాతో ‘జూన్‌ 12న’ అని చెప్పారు రజనీకాంత్‌. నెల్సన్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా రూపొందిన ‘జైలర్‌’ (2023) సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. 

ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఇదే కాంబినేషన్‌లో ‘జైలర్‌’ రూపొందుతోంది. ఈ చిత్రం కేరళ షెడ్యూల్‌ని ముగించుకుని చెన్నై చేరుకున్న రజనీకాంత్‌తో ఎయిర్‌పోర్టులో మీడియా ప్రతినిధులు షూటింగ్, రిలీజ్‌ డేట్‌ గురించి ప్రస్తావించారు. షూటింగ్‌ బాగా జరుగుతోందని చెప్పడంతో పాటు విడుదల తేదీ కూడా చెప్పారు రజనీకాంత్‌. దాంతో ‘జైలర్‌’ సీక్వెల్‌ విడుదల తేదీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న రజనీ అభిమానులు ఖుషీ అయ్యారు.

 2026 జూన్‌ 12న ‘జైలర్‌ 2’ విడుదల కానుంది. తొలి భాగంలో రజనీ భార్యగా నటించిన రమ్యకృష్ణ ఈ చిత్రంలోనూ ఆ పాత్రలో కనిపిస్తారు. అలాగే ఫస్ట్‌ పార్ట్‌లో కీలక పాత్రలు చేసిన మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్‌ కూడా రెండో భాగంలో నటిస్తున్నారు. ఇంకా బాలకృష్ణ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ మూవీని సన్‌ పిక్చర్స్‌పై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)