Breaking News

'అర్థమైందా రాజా' వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు: రజనీకాంత్‌

Published on Sat, 01/27/2024 - 12:58

ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహించిన మూడో చిత్రం 'లాల్‌ సలామ్‌' ఆడియో ఆవిష్కరణ శుక్రవారం చెన్నైలోని శ్రీ సాయిరామ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో విక్రాంత్, విష్ణు విశాల్ ప్రధాన పాత్రలలో నటించారు, ఇందులో రజనీకాంత్  అతిధి పాత్రలో కనిపించగా ఏఆర్‌ రెహమాన్ సంగీతం అందించారు.  లైకా ప్రొడక్షన్స్ ద్వారా సుభాస్కరన్  ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 9న థియేటర్లలోకి లాల్‌ సలామ్‌ రానుంది.

లాల్‌ సలామ్‌ సినిమా ఆడియో లాంచ్‌ కార్యక్రమంలో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. లాల్ సలామ్ గురించి రజనీకాంత్ మాట్లాడుతూ.. "నా పాత్ర, మొయిదీన్ భాయ్, దక్షిణాది జిల్లాలో నివసించిన ఒక వ్యక్తి ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రం 1992లో జరిగిన రియల్‌ సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. కానీ అవకాశవాదులు అతని పేరును తెరపై లేకుండా చూడాలని కోరుకున్నారు. వారు అతని గుర్తింపును దాచారు. మత సామరస్యంతో ఈ చిత్రం నిండి ఉంటుంది.' అని రజనీ చెప్పారు.

నాకు ఎవరూ పోటీ కాదు
జైలర్‌ సినిమా ఈవెంట్‌లో భాగంగా  'అర్థమైందా రాజా' అంటూ నేను చేసిన వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకుని వైరల్‌ చేశారు. సాధారణంగా చెప్పిన మాటలను దళపతి విజయ్‌పై కావాలనే నేను ఆ వ్యాఖ్యలు చేసినట్లు వ్యాప్తి చేశారు. నాకు చాలా బాధ అనిపించింది. నేను అతన్ని చిన్నతనం నుంచి చూస్తున్నాను. విజయ్‌ నా కళ్ల ముందే పెరిగాడు. ఎంతో పట్టుదలతో కష్టపడి నేడు ఈ స్థాయికి చేరుకున్నాడు. అలాంటి వ్యక్తిపై నేను ఎందుకు కామెంట్లు చేస్తాను. నాకు ఎవరితోనూ పోటీ ఉండదు. నాకు నేనే పోటీగా కొనసాగుతాను. ఈ సమయంలో నా అభిమానులకు చెప్పేది ఒక్కటే.. మా ఇద్దరినీ పోల్చి చూడకండి.' అని రజనీకాంత్‌ వివరణ ఇచ్చారు.

జైలర్‌ ఈవెంట్‌లో రజనీకాంత్‌  మాట్లాడుతూ.. 'మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు.. ఇవి రెండూ జరగని ఊరు లేదు.. మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి.. అర్థమైందా రాజా..' అంటూ తన జీవితంలో ఎదురైన పరిస్థితులను వివరిస్తూ కామెంట్‌ చేశారు. ఆ సమయంలో విజయ్‌, ఆయన ఫ్యాన్స్‌ను ఉద్దేశించే రజనీ ఈ వ్యాఖ్యలు చేశారంటూ కోలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో రజనీపై విజయ్‌ ఫ్యాన్స్‌ భారీగా ట్రోల్స్‌ చేసిన విషయం తెలిసిందే.

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)