సీఎం యోగి పాదాలను తాకడంపై క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్‌

Published on Tue, 08/22/2023 - 09:59

సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం జైలర్‌ సక్సెస్‌లో ఆయన ఉన్నారు. ఆగష్టు 10న విడుదలైన జైలర్‌ ఇప్పటికి కూడా కలెక్షన్స్‌లలో తగ్గడం లేదు. సినిమా రిలీజ్‌కు ముందు హిమాలయాల యాత్రకు వెళ్లి వచ్చిన తలైవా ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసేందుకు లక్నోలోని ఆయన నివాసానికి రజనీ వెళ్లారు. ఆ సమయంలో యోగి పాదాలకు రజనీకాంత్‌ నమస్కరించారు. దీంతో ఆ వీడియో సోషల్‌మీడియాలో భారీగా వైరల్‌ అయింది.

(ఇదీ చదవండి: రజనీకాంత్‌కు చిరంజీవి ఇచ్చిన సలహా)

అయితే రజనీకాంత్  చేసిన పనికి నెటిజన్స్ భిన్నంగా స్పందించారు. తలైవా తీరును కొందరు తప్పుపట్టినా మరికొందరు మాత్రం సూపర్ స్టార్ చేసిన పనిని సమర్థించారు. రజినీకాంత్‌ ఎందుకలా చేశాడంటూ నెట్టింట భారీ చర్చ మొదలైంది. వయసులో తనకంటే చాలా చిన్నవాడైనా యోగి కాళ్లకు నమస్కరించాల్సిన అవసరం ఏంటని తలైవాపై పలు ప్రశ్నలు వచ్చాయి.

తాజాగ చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రజనీ ఇదే విషయంపై మీడియాతో ఇలా స్పందించారు. ' యోగులు, సన్యాసిల పాదాలను తాకి, వారి ఆశీర్వాదం తీసుకోవడం నా అలవాటు, వారు నా కంటే చిన్నవారైనా, నేను ఆ పని తప్పకుండా చేస్తాను. అందుకే వయసుతో నిమిత్తం లేకుండా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాదాలకు నమస్కరించాను. అంతకు మించి మరో ఉద్దేశ్యం లేదు.' అని ఆయన తెలిపారు. రూ.500 కోట్లకు పైగా వసూళ్లతో జైలర్‌ దూసుకెళ్తుండటంతో ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.  జైలర్‌ ద్వారా తనకు భారీ విజయాన్ని అందించినందుకు దేశవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు, సినీ ప్రేమికులకు రజనీ కృతజ్ఞతలు తెలిపారు. 

(ఇదీ చదవండి: చిరంజీవి కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది.. వివరాలు ఇవే)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)