Breaking News

రజనీకాంత్‌కు షాకింగ్‌ రెమ్యునరేషన్‌.. 7 రోజులకే అన్ని కోట్లా?

Published on Thu, 02/16/2023 - 11:40

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చరిష్మా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏడు పదుల వయసు దాటిన ఆయన క్రేజ్‌ మాత్రం తగ్గడం లేదు. తలైవా తెరపై కనిపిస్తే చాలు.. కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్‌ దద్దరిల్లిపోతుంది.ఆ స్థాయిలో వెండితెరను శాసిస్తాడు కాబట్టే పారితోషికం కూడా అదే స్థాయిలో తీసుకుంటాడు.

ప్రస్తుతం  రజనీకాంత్‌ నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో జైల‌ర్ అనే సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు లాల్‌ సలామ్‌ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో రజనీకాంత్‌ హీరోగా కాకుండా.. గెస్ట్‌ రోల్‌ ప్లే చేస్తున్నాడు. విష్ణు విశాల్, విక్రాంత్‌ హీరోలుగా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

లాల్‌ సలామ్‌ కోసం రజనీకాంత్‌ వారం రోజుల కాల్షీట్‌ను కేటాయించారట. అయితే  ఈ ఏడు రోజులకు గాను ఆయన భారీగానే పారితోషికం పుచ్చుకుంటున్నారట. వారం రోజులకుగాను రూ.25 కోట్ల రెమ్యునరేషన్‌ ఇచ్చేందుకు లైకా సంస్థ సూపర్‌స్టార్‌తో డీల్‌ కుదుర్చుకుందట. త్వరలోనే లాల్‌ సలామ్‌ సెట్‌లోకి రజనీకాంత్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 

మరోవైపు ‘జైలర్‌’ మూవీ కోసం కూడా రజనీకాంత్‌ భారీగానే డిమాండ్‌ చేశారట. ఈ సినిమా కోసం రజనీకాంత్‌ ఏకంగా రూ.140 కోట్లు తీసుకుంటున్నాడట. దక్షిణాదికి చెందిన హీరోలలో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న స్టార్స్‌లో రజనీకాంత్‌ మొదటి స్థానంలో ఉన్నారని ఇండస్ట్రీ టాక్‌. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)