Breaking News

షష్టిపూర్తి సినిమాని కుటుంబమంతా చూడాలి– రాజేంద్ర ప్రసాద్‌

Published on Thu, 01/09/2025 - 04:55

‘‘మంచి కథతో రూపొందిన చిత్రం ‘షష్టిపూర్తి’. తెలుగు వారి సంప్రదాయం, సంస్కృతిని ఇష్టపడేవారు ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాలి. మన ఇంట్లో ఏం ఉంటే సంతోషంగా ఉంటామనేది ఈ చిత్రం చెబుతుంది. అందుకే అందరూ కుటుంబంతో సహా థియేటర్‌కి వెళ్లి ఈ సినిమా చూడాలి’’ అని నటుడు రాజేంద్ర ప్రసాద్‌ కోరారు. రూపేష్, ఆకాంక్షా సింగ్‌ జంటగా, రాజేంద్ర ప్రసాద్, అర్చన మరో జోడీగా నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’. 

పవన్‌ ప్రభ దర్శకత్వంలో రూపేష్‌ చౌదరి నిర్మించారు. బుధవారం జరిగిన సమావేశంలో రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘ఆ నలుగురు’ తర్వాత నేను చేసిన సినిమాలు భగవంతుడు వేసిన భిక్ష అనుకోవాలి. ‘షష్టిపూర్తి’ లాంటి అద్భుతమైన సినిమా చేసే అవకాశాన్ని నాకు కల్పించాడు దర్శకుడు పవన్‌. ‘లేడీస్‌ టైలర్‌’ తర్వాత అర్చన, నేను మళ్లీ నటించిన ‘షష్టిపూర్తి’లో మా ఇద్దరి పాత్రలు అద్భుతంగా ఉంటాయి’’ అని చెప్పారు. 

అర్చన మాట్లాడుతూ–‘‘చాలా విరామం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ‘షష్టిపూర్తి’ ద్వారా నాకు ఇంత గొప్ప స్వాగతం పలికిన అందరికీ కృతజ్ఞతలు’’ అని తెలిపారు. ‘‘నా మొదటి సినిమా ఇది. అందరూ ఆదరించాలి’’ అన్నారు రూపేష్‌. పవన్‌ ప్రభ మాట్లాడుతూ–‘‘నాకు ఇంతమంచి నటీనటులను, సాంకేతిక నిపుణులను ఇచ్చిన నిర్మాత రూపేష్‌గారికి థ్యాంక్స్‌’’ అని పేర్కొన్నారు. ‘‘మా సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడాలి’’ అని ఆకాంక్షా సింగ్‌ అన్నారు.   

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)