Breaking News

రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం

Published on Sat, 10/05/2024 - 07:03

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కూతురు గాయత్రి (38) గుండెపోటుతో మరణించారు. శుక్రవారం రాత్రి గుండె వద్ద నొప్పిగా ఉందని ఆమె చెప్పడంతో వెంటనే  హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గాయత్రి తుదిశ్వాస విడిచారు. అర్దరాత్రి సుమారు 1గంటకు ఆమె మరణించారు. గుండెపోటు వల్లే గాయత్రి మరణించినట్లు వైద్యులు తెలిపారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమార్తెతో పాటు ఒక కుమారుడు ఉన్నారు. ఆమె మరణంతో  రాజేంద్ర ప్రసాద్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.

 కూతురిలో అమ్మను చూసుకున్న: రాజేంద్రప్రసాద్‌  

రాజేంద్రప్రసాద్‌ గతంలో తన కూతురు గాయత్రి గురించి మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఆయన తన కూతురు గురించి చెబుతూ ఇలా ఎమోషనల్‌ అయ్యారు. అమ్మ లేని వాడు కూతురిలో అమ్మను చూసుకుంటాడని ఒక సినిమా వేదిక మీద పంచుకున్నారు. 'నా పదేళ్ల వయసులో మా అమ్మ గారు చనిపోయారు. ఆ బాధ ఎప్పుడూ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. అయితే, నాకు  కూతురు (గాయత్రి ) పుట్టిన తర్వాత మా అమ్మను తనలోనే చూసుకుంటున్నా. కానీ, ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో తనతో మాటలు లేవు. 

అయినప్పటికీ.. బేవార్స్ అనే సినిమాలోని 'తల్లీ.. తల్లీ.. నా చిట్టి తల్లి' అనే పాటను గాయత్రికి వినిపించాలని ఇంటికి తీసుకొచ్చాను. ఈ పాటను ఆమెకు నాలుగుసార్లు వినిపించాను.' అని ఆయన అన్నారు. ఆమె ప్రేమ వివాహం చేసుకున్న కొద్దిరోజుల తర్వాత తన కూతురిని రాజేంద్రప్రసాద్‌ స్వాగతించిన విషయం తెలిసిందే.

 

#

Tags : 1

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)