Breaking News

ఎన్టీఆర్‌ నాకంటే 9 ఏళ్లు చిన్నోడు.. ‘ఒరేయ్‌’ అంటే షాకయ్యా: రాజీవ్‌

Published on Mon, 04/07/2025 - 09:43

జూనియర్‌ ఎన్టీఆర్‌(Jr NTR), రాజీవ్‌ కనకాల(Rajeev Kanakala ) మంచి స్నేహితులనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడంటే ఎన్టీఆర్‌ షూటింగ్స్‌, ఫ్యామిలీతో బిజీ అయ్యాడు కాబట్టి స్నేహితలతో కలవలేకపోతున్నాడు. కానీ ఒకప్పుడు మాత్రం ఖాలీ సమయం దొరికితే చాలు రాజీవ్‌తో పాటు ఒకరిద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా గడిపేవాడు. వయసులో తనకంటే తొమ్మిదేళ్లు పెద్దవాడైన రాజీవ్‌తో ఎన్టీఆర్‌ స్నేహం చేయడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. రాజీవ్‌ కూడా ఎన్టీఆర్‌ తనతో స్నేహం చేస్తాడని ఊహించలేదట. అనుకోకుండా వీరిద్దరు మంచి స్నేహితులుగా మారిపోయారట. 

ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు రాజీవ్‌. ‘స్టూడెంట్‌ నెంబర్‌ 1’ సినిమా షూటింగ్‌ సమయంలో మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. మొదట్లో సార్‌ సార్‌ అంటూ మాట్లాడేవాడు. ఓ సారి నేనే ‘సార్‌ వద్దులే రాజీవ్‌ అని పిలువు చాలు’ అని చెప్పా. మరుసటి రోజు షూటింగ్‌కి రాగానే ‘రాజీవ్‌’ అని పిలిచాడు. నేను ఏదో అలా పిలవమని చెప్పానే అనుకో ఎన్టీఆర్‌ అలా పిలిచేస్తాడా(నవ్వుతూ..). సరే హరికృష్ణ గారి అబ్బాయి కదా అనుకొని లైట్‌ తీసుకున్నా. మరుసటి రోజు ‘రాజీవ్‌ గారు..’ అన్నారు. ‘పోనీలే కనీసం ‘గారు’ చేర్చాడు కదా సంతోషం అన్నుకున్నా. 

ఆ తర్వాత రోజు ఇంటర్వెల్‌ సీన్‌ షూటింగ్‌ జరుగుతోంది. నేను ఇలా నడుచుకుంటూ వస్తున్నా.. బిల్డింగ్‌ పైన  ఉన్న ఎన్టీఆర్‌.. ‘ఒరేయ్‌ రాజా..’ అన్నారు.  రాజీవ్‌గారు నుంచి రారానా? అని షాకయ్యాను. ఏంటి ‘రా’ అంటున్నావ్‌ అని అడిగా. మరి ఫ్రెండంటే అనరా? ఎన్టీఆర్ అన్నాడు. ఆ తర్వాత ఓ సారి మేమిద్దరమే ఉన్నప్పుడు ఓ విషయం షేర్‌ చేసుకొని ఎమోషనల్‌ అయ్యాం. ఆ తర్వాత మరింత క్లోజ్‌ అయ్యా.. అలా మా ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది’ అని రాజీవ్‌ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్‌ ని మొదటి సారి సెట్‌లో చూసినప్పుడు ఇతనితో పని చేయడమే కష్టం అనుకున్నాడట రాజీవ్‌. అలాంటింది ఇప్పుడు బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా మారిపోయారు. 
 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)