Breaking News

అప్పుడు రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా : రాజమౌళి

Published on Tue, 11/28/2023 - 00:07

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం (నవంబర్ 27) హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.ఈ ఈవెంట్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథులుగా విచ్చేసారు.

ఈ సందర్బంగా దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఎంతోమంది కొత్త కొత్త డైరెక్టర్లు వస్తారు. హిట్‌లు, సూపర్ హిట్ సినిమాలు తీస్తారు. చాలా పెద్ద పేరు కూడా సంపాదిస్తారు. అవి మనం తరచుగా చూస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడో ఓ సారి మాత్రమే ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ మొతాన్ని షేక్‌ చేసే డైరెక్టర్‌ వస్తాడు.

అతడు సినిమా అంటే ఇలాగే తీయాలన్న ఫార్ములాను కూడా షేక్ చేస్తాడు. అలాంటి డైరెక్టర్‌ నాకు తెలిసి నా తరంలో రాంగోపాల్ వర్మ. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా అలాంటి డైరెక్టర్‌. సినిమా ఇలాగే తీయాలన్న రూల్ పక్కన పెట్టి.. నేను ఇలాగే సినిమా తీస్తా అనే డైరెక్టర్ అతడు. నిన్ను చూసి చాలా గర్విస్తున్నా" అని సందీప్ ను ఉద్దేశించి రాజమౌళి అనడం విశేషం.

యానిమల్ చిత్ర టీజర్‌ చూడగానే ఈ సినిమా నేను చూడాలని వెంటనే అనిపించింది. రాబోయే మూడు సంవత్సరాల్లో కూడా టీజర్‌ చూడగానే మొదటి రోజే చూడాలనిపించిన చిత్రం యానిమల్ అంటూ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై దర్శక ధీరుడు ప్రశంసలు కురిపించాడు.

నా ఫేవరేట్‌ యాక్టర్‌ రణ్‌బీర్ కపూర్: రాజమౌళి
బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రణ్‌బీర్ కపూర్ గురించి రాజమౌళి మాట్లాడుతూ.. నా ఫేవరేట్‌ బాలీవుడ్‌ యాక్టర్‌ ఎవరు అంటూ నన్ను చాలా మంది అడిగితే ఏ మాత్రం ఆలోచించకుండ రణ్‌బీర్ కపూర్ అని చెప్తాను. నేను చూసిన తన సినిమాలు తక్కువే కానీ చాలా ఇంటెన్సిటీ ఉన్న నటుడు. తన 15 ఏళ్ల కెరీర్‌లో తన టాలెంట్‌ చూపించుకునేలాంటి చిత్రాలు చాలా తక్కువ వచ్చాయి. యానిమల్‌తో తనకు ఆ లోటు తీరుతుంది. రణ్‌బీర్ కపూర్ ఇండస్ట్రీలోనే టాప్‌లో ఉంటాడని జక్కన్న అన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)