Breaking News

హీరోయిన్‌కు ముద్దు.. ఘాటుగానే స్పందించిన డైరెక్టర్!

Published on Wed, 08/30/2023 - 16:51

రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరో, హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'తిరగబడరాసామీ'. ఈ చిత్రానికి  ఎస్‌. రవికుమార్‌ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు.  సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్‌ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు మేకర్స్. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో పలువురు చిత్ర యూనిట్ సభ్యులు కూడా పాల్గొన్నారు.

(ఇది చదవండి:  కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోన్న రాజ్ తరుణ్ హీరోయిన్!)

ముద్దు సీన్‌తో వివాదం

అయితే ఈ ఈవెంట్‌కు హాజరైన ప్రేక్షకులకు ఊహించని సంఘటన ఎదురైంది. ఈవెంట్‌కు హాజరైన హీరోయిన్‌ మన్నారా చోప్రాకు దర్శకుడు రవికుమార్ బహిరంగంగా ముద్దుపెట్టడం వివాదానికి దారితీసింది. ఆయన తీరుపై పలువురు నెటిజన్స్   ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో డైరెక్టర్ తీరును నెటిజన్స్ విమర్శించారు. కాగా.. గతంలో ఇలానే కాజల్ స్టేజీపై మాట్లాడుతుండగా సినిమాటోగ్రాఫర్ చోటా. కె. నాయుడు ముద్దుపెట్టేశాడు.

మీకేం ఇబ్బంది?

అయితే తాజాగా ఈ విషయంపై స్పందించారు. తాను హీరోయిన్‌కు ముద్దుపెట్టడంతో తప్పేంటని రవికుమార్ ప్రశ్నిస్తున్నారు.  ఆమె పట్ల అప్యాయతతోనే అలా చేశానని చెప్పుకొచ్చారు.  నా కూతురికి కూడా అలాగే ముద్దుపెడతా అంటూ వివరణ ఇచ్చారు. అయినా ఆమెకు, మా ఫ్యామిలీకి లేని ఇబ్బంది మీకేంటని నెటిజన్లను నిలదీశారాయన. నా సినిమాలో మన్నారా చోప్రా ఆమె చేసిన వర్క్ నచ్చడం వల్లే అలా చేశానని రవికుమార్ వెల్లడించారు. ఏదేమైనా ఈవెంట్‌లో అందరిముందు అలా ముద్దులు పెట్టడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

(ఇది చదవండి: రాఖీ సంబురాల్లో కాబోయే మెగా కోడలు.. సోషల్ మీడియాలో వైరల్!)

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి